చైనా ఎటూ భారత్ కి శత్రువే. నాటి ప్రధాని నెహ్రూ భారత్ చైనా బాయీ బాయీ అని గుడ్డిగా నమ్మారు. ప్రతిఫలంగా చైనా వెన్ను పోటు పొడిచింది. 1962లో యుధ్ధం చేసి మన భూభాగాన్ని లాగేసింది. ఆ దెబ్బకు భారత్ కి భాయీ బాయీ కాదు అని తెలిసివచ్చింది. అది లగాయితూ చైనా ఎపుడూ భారత్ తో స్నేహం చేసినట్లు నటించినా ఇండియా జాగ్రత్తగానే ఉంటూ వస్తోంది.

 

ఇపుడు మొత్తం ప్రపంచానికి తెలిసిపోయింది. చైనా ఎంతటి మహమ్మారో, అది కరోనా వైరస్ కంటే ఎంతటి ప్రమాదకారో అన్ని దేశాలు గ్రహించాయి. అన్నింటికీ మించి అమెరికా గ్రహించింది. ట్రంప్ అయితే అసలు ఊరుకోవడం లేదు. చైనా అంతు తేలుస్తామని గట్టిగానే శపధం చేస్తున్నాడు. చైనాను అసలు వదలమని కూడా హెచ్చరిస్తున్నాడు.

 

చైనా ముక్కు పిండి అయినా నష్టపరిహారం వసూల్ చేస్తామని ట్రంప్ నిప్పులు చెరుగుతున్నాడు. చైనా భయంకరమైన కరోనా వైరస్ ని ప్రపంచం మీదకు వదిలిందని, బాధ్యత లేకుండా మానవాళి వినాశనానికి పూనుకుందని కూడా ట్రంప్ అంటున్నాడు. అంతే కాదు, కరోనా మహమ్మారి ఉన్నపుడు కూడా చైనా ఏ మాత్రం సమాచారం ఇవ్వకుండా తన దేశం నుంచి అంతర్జాతీయ విమానాలు నడిపి మొత్తం ప్రపంచానికి ఈ వైరస్ అంటించిందని కూడా ఘాటు విమర్శలు చేశాడు. 

 

నిజమే  చైనా ఆదిలోనే తన దేశంలోనే ఈ మహమ్మారిని అణచివేసిఉంటే ఈ రోజు ప్రపంచానికి ఇంతటి విపత్తు సంభవించదు కదా. ఈ రోజు ప్రపంచం మొత్తం నష్టపోయింది. అందరూ ఈ పాపాన్ని మోస్తున్నారు. దీనికి పరిహారం అని చైనా ఇవ్వాల్సిందే అన్న ట్రంప్ మాటల్లో లాజిక్కే కాదు, న్యాయం కూడా ఉంది. ఈ దశలో మిగిలిన దేశాలు కూడా చైనాను దోషిగా చేసి బోనులో నిలబెట్టాలన్న డిమాండ్ కూడా వస్తోంది.

 


ఏది ఏమైనా ఒక్కటి మాత్రం నిజం. ఏ దేశం కలసిరాకపోయినా కూడా అమెరికా మాత్రం చైనాను అసలు వదలదు, ట్రంప్ రెండవ మారు కనుక అమెరికా ప్రెసిడెంట్ గా గెలిస్తే చైనా ఆటలు సాగని ఎంత మాత్రం సాగవు, దెబ్బకు చిత్తు అయిపోతుంది. అని అంటున్నారు.

 


\

మరింత సమాచారం తెలుసుకోండి: