లాక్ డౌన్ సమయంలో వలస కూలీల కష్టాలను పత్రికలు అనేక సార్లు కళ్లకు కట్టాయి. వందల వేల కిలోమీటర్లు కాలినడకనే వెళ్తున్న వలస కూలీల బాధలు చూస్తే గుండె తరుక్కుపోతుంది. అలాంటి వలస కూలీల కష్టాలను కళ్లకు కడుతూ ఆదేశ్ రవి అనే రచయిత రాసిన పాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

సామాన్య పదాలతో వలస కూలీల కష్టాలను వర్ణించిన పాట ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకంటోంది. ఎందరి హృదయాలనో కదిలిస్తోంది. లాక్ డౌన్‌లో చిక్కుకుపోయిన ఓ కూలీ తన కుటుంబాన్ని తలచుకుంటూ పాడిన ఈ పాట ఇటీవలి కాలంలో వచ్చిన ఓ అత్యున్నత గేయం అనడంలో సందేహం లేదు.

 

ఆ పాట హెరాల్డ్ పాఠకుల కోసం..

 

పిల్ల జెల్లా ఇంటికాడ ఎట్లఉండ్రో..

నా ముసలి తల్లిని ఏమి పెట్టి సాదుతుందో...

 

పూట పూటా చేసుకోని బతికేటోళ్లం...

పూటగడవ ఇంత దూరం వచ్చినోళ్ళం..

 

దేశ మేమో గొప్పదాయే

మా బతుకులేమో సిన్నవాయే..

 

మాయదారి రోగమొచ్చి..

మా బతుకు మీద మన్నుబొసి..

 

ఏమి బతుకు ఏమీ బతుకు చెడ్డ

బతుకు చెడ్డ బతుకు చెడ్డ బతుకు

చెడ్డ బతుకు చెడ్డ బతుకు...

 

పేద రోగం కంటే పెద్దా రోగముందా..

అయిన వాళ్ళ కంటే పెద్ద అండ ఉందా..

 

కష్టకాలం ఇంటికాడ ఉంటే సారో...

కలిసిమెలిసి కలిగంజో తాగేటొల్లం...

 

పిల్లగాండ్లు కన్నులల్ల ఇడవకుండా మెదలబట్టె...

ఇంటి దాని దుఃఖమెమో ఆగకుండా తరమబట్టే...

ఏమి చేతు ఏమి చేతు ఏమి చేతు ఏమి చేతు....

ఏమి చేతు ఏమి చేతు ఏమి చెతు...

 

బస్సులోదూ బండ్లుఓద్దు అయ్యా సారు...

ఇడిసిపెడితే నడిసి నేను బోతసారు...

 

ఇంటికాడ పిల్ల జల్లా ఎట్లా ఉండ్రో...

నా ముసలి తల్లిని ఏమి పెట్టి సాదుతుందో...

 

ఇడిసిపెడితే నడిసి నేను పోత సారూ....

ఇడిసిపెడితే నడిసి నేనూ పోత సారూ..!

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: