జూదం మనిషిని ఎంత నీచానికి దిగ జారుస్తుంది అనడానికి మరోసారి రుజువైందని చెప్పవచ్చు. ఒక నీచుడు పేకాటలో డబ్బులు పోగొట్టుకొని తన భార్య శీలాన్ని తాకట్టు పెట్టిన అతి దారుణమైన కథ ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకి ఎవరో కాదు ఒడిగట్టింది ఆ మూర్ఖుడి స్నేహితులే. ఇక అసలు విషయానికి వస్తే.... 

IHG


ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని  ఘజియాబాద్ లో చోటుచేసుకుంది. ఆ ప్రబుద్ధుడు లాక్ డౌన్ కారణంగా ఇంట్లో ఉంటూనే అతడి స్నేహితులతో పేకాట ఆడడం మొదలు పెట్టాడు. అతడితో పాటు ముగ్గురి స్నేహితులతో పేకాట ఆడుతుండగా అతని జేబులో డబ్బులు అయిపోవడంతో ఆ నీచుడు ఏకంగా తన భార్యని జూదంలో తాకట్టు పెట్టాడు. తీరా సీన్ కట్ చేస్తే... అతను జూదంలో ఓడిపోయాడు. తను ఓడిపోతే భార్యని అప్ప చెబుతానని పందెం కాసిన అతనికి అతడు ఓడిపోవడంతో అతని స్నేహితులు అతడి భార్య పై లైంగిక వేధింపులకు గురి చేశారు.

 

IHG


దీనితో వారి చర్యలను భరించలేక పోయిన అతడి భార్య పోలీసులను ఆశ్రయించడంతో అసలు దారుణం బయటికి వచ్చింది. అతడి భర్త జూదంలో తనను తాకట్టు పెట్టి ఓడిపోవడంతో అతని స్నేహితులు తనను లైంగికంగా వేధింపులకు గురి చేశారని ఆవిడ ఫిర్యాదు చేసింది. వారి ఇంట్లోనే తన స్నేహితులతో కలిసి పేకాట ఆడుతూ గంజాయి సేవించేవారని ఆవిడ తెలిపింది. అంతే కాకుండా తన స్నేహితుల కామకోరికలు తీర్చాలంటూ వేధించే వాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. దీనితో పోలీసులు కేసు నమోదు చేసి భర్తను అదుపులోకి తీసుకున్నారు.

IHG

 

మరింత సమాచారం తెలుసుకోండి: