ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గుంటూరు రాజకీయాలు వేడెక్కుతున్నాయి. విడుదల రజిని  ' సెగ ' తట్టుకోలేక టిడిపి మాజీ మంత్రి పుల్లారావు ముప్పుతిప్పలు పడుతున్నారట. నరసరావుపేట నియోజకవర్గం లో విడుదల రజిని ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ పోతూ కరోనా వైరస్ విపత్కర సమయంలో చాలా అందంగా ఉంటుంది. నియోజకవర్గంలో తల పండిపోయిన రాజకీయ నేతల పేర్లు వినబడకుండా తనదైన శైలిలో దూసుకుపోతుంది. ఇదే విషయాన్ని పరిశీలకులు చెబుతున్నారు. నియోజకవర్గంలో ఇటీవల రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం లను ఆకట్టుకునే విధంగా రజిని చేపట్టిన కార్యక్రమాలకు వందకి వంద మార్కులు పడ్డాయట.

 

తన కుటుంబానికి పెద్దగా రాజకీయ అండ లేకపోయినా గాని పొలిటికల్ ఫీల్డ్ లో అడుగు పెట్టిన నాటి నుండి తన వాక్చాతుర్యంతో దూసుకుపోతుంది. మర్రి రాజశేఖర్ కుమార్తెగా పొలిటికల్ ఫీల్డ్ లోకి దిగిన విడుదల రజిని ఆ తర్వాత ఎక్కడా తన తండ్రి పేరు రాకుండా తనదైన శైలిలో దూసుకుపోతోంది. నియోజకవర్గంలో తన ప్రత్యర్థి పుల్లారావు ని మరియు అతని కుటుంబాన్ని ఎన్నికల ప్రచారం నుండి టార్గెట్ చేసి మరీ విమర్శలు కురిపించింది. ఆ సమయంలోనే వాటిని ఖండిస్తూ దూకుడుగా వ్యవహరించారు పుల్లారావు.

 

ప్రస్తుతం అధికారంలో రజిని ఉండటంతో...సైలెంట్ గా పొలిటికల్ గా 'పుల్లారావు' పేరు వినిపించకుండా పక్కా వ్యూహా లతో పొలిటికల్ స్టెప్పులు వేస్తుంది. ఇటువంటి నేపథ్యంలో నియోజకవర్గ టిడిపి నాయకులు పుల్లారావు ని సైలెంట్ గా ఉండకూడదు ఈ టైములో ఏదోవిధంగా ఉనికి చాటుకునే విధంగా వ్యవహరించాలని కోరుతున్నారు. ఇలానే రాబోయే రోజుల్లో కొనసాగితే పుల్లారావు పొలిటికల్ కెరియర్ డేంజర్ జోన్ లో పడినట్లే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple. 

మరింత సమాచారం తెలుసుకోండి: