రెండో దశ లాక్ డౌన్ చివరి దశకు చేరుకుంది. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుందని ప్రజలలో టెన్షన్ నెలకొంది. మే 3వ తేదీ నుండి చాలా వరకు లాక్ డౌన్ ఎత్తి వేయాలని కేంద్ర ప్రభుత్వం అనుకుంటుంది. ముఖ్యంగా గ్రీన్ జోన్ ప్రాంతాలలో ఉపసంహరించేందుకు రెడీ అవుతుంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఉన్న బిజెపి పాలిత రాష్ట్రాలలో లాక్ డౌన్ ఎత్తేయడానికి మోడీ రెడీ అవుతున్నారు. ముందుగా కర్ణాటకతో ప్లానింగ్ స్టార్ట్ చేసి ఆ తరువాత మిగతా రాష్ట్రాలలో పరిస్థితి బట్టి ముందడుగు వేయడానికి కేంద్రం ఆలోచిస్తున్నట్లు సమాచారం.

 

కర్ణాటక రాష్ట్రంలో మొత్తం 30 జిల్లాల‌కు గానూ 22 జిల్లాలు గ్రీన్ జోన్లుగా ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ఈ గ్రీన్ జోన్ లోని 22 జిల్లాల్లో వ్యాపారాలు, ఇత‌ర యాక్టివిటీస్ ప్రారంభించ‌డానికి ప్ర‌భుత్వం సానుకూలంగా ఉన్న‌ట్టుగా స‌మాచారం. ముఖ్యంగా బెంగళూరు మరియు మైసూరు వంటి ప్రధాన నగరాల్లో వైరస్ పూర్తిగా అదుపులోకి వచ్చాక అప్పుడు లాక్ డౌన్ నుంచి పాక్షిక మిన‌హాయింపుల‌కు కేంద్రం సుముఖత చూపుతున్నట్లు సమాచారం.

 

ఇదే టైమ్ లో మే 3 నుంచి గ్రీన్ జోన్ ప్రాంతాల్లో మాల్స్, థియేట‌ర్లు వంటివి ఓపెన్ చేయ‌కుండా, స‌భ‌ల‌కు, స‌మావేశాల‌కు అనుమ‌తులు ఇవ్వ‌కుండా.. ఇత‌ర యాక్టివిటీస్ కు ఊపు అందించేందుకు క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం దాదాపుగా రెడీ అవుతోంది. మొత్తంమీద చూసుకుంటే కర్ణాటక నుండి మోడీ ప్లానింగ్ స్టార్ట్ కాబోతున్నట్లు అర్థమవుతుంది. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple. 

 

 

  

మరింత సమాచారం తెలుసుకోండి: