ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ ప్రభావం తగ్గినట్లు కనబడటంతో మే 3 తర్వాత కూడా లాక్ డౌన్ నిబంధనలు పొడిగించే అవకాశం ఉన్నట్లు ఎక్కువగా కనిపిస్తోంది. ఇదే సమయంలో ఇటీవల రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో చాలామంది ముఖ్యమంత్రులు కూడా లాక్ డౌన్ నిబంధనలు పొడిగించాలని మోడీకి సూచించినట్లు సమాచారం. ఈ వేసవి దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉంటేనే గాని భారతదేశంలో కరోనా వైరస్ కంట్రోల్ కాదని అంతర్జాతీయ సంస్థలు సూచనలు ఇస్తున్నాయి. మరోపక్క ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా చాలావరకూ కరోనా వైరస్ పై ఇండియా చాలా అద్భుతంగా పోరాడిందని జూన్ వరకు లాక్ డౌన్ నిబంధనలు అమలులో ఉంటే ఇండియా కరోనా వైరస్ రహిత దేశంగా అవతరిస్తుందని చెప్పుకొస్తున్నారు.

 

మరోపక్క కొన్ని రాష్ట్రాలలో వలస కూలీలు మరియు పేద వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉండటంతో ఆయా ప్రాంతాలలో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలు ఎత్తివేసేందుకు  మొగ్గుచూపుతోంది. ఈ నేపథ్యంలో ఎలాంటి ఆంక్షలు విధించకుండా ఫ్రీగా జనాలని రోడ్లపై స్వేచ్ఛగా తిరిగేందుకు అనుమతిస్తే.. పరిస్థితి పూర్తిగా అదుపు తప్పే అవకాశం ఉందని కేంద్రం భావిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో  లాక్ డౌన్ నిబంధనలు ఎత్తివేసే ప్రాంతాలలో పాఠశాలలు, ప్రజారవాణా, సినిమా హాళ్లు, మాల్స్, కళ్యాణ మండపాలు వంటిచోట్ల లాక్ డౌన్ నిబంధనలు యధావిధిగా కొనసాగించాలని చూస్తోంది.

 

ముఖ్యంగా సోషల్ డిస్టెన్స్ అదేవిధంగా ముఖానికి మాస్క్ పెట్టుకుని మాత్రమే రోడ్డుపైకి జనాలు వచ్చే విధంగా కేంద్రం అడుగులు వేస్తోంది. మాస్క్ విషయంలో ప్రజలకు అలవాటు చేసే విధంగా పెట్టుకోకపోతే ఫైన్ వేయడానికి కేంద్రం ఆలోచిస్తున్నట్లు సమాచారం. మొత్తం మీద అర్థం చేసుకోవాల్సిన చేదు నిజం ఏమిటంటే ఇది పూర్తిగా కనుమరుగయ్యే వైరస్ కాదని ప్రజలతోనే ఉంటుందని అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: