కరోనా కట్టడి చేయడంలో జగన్ ప్రభుత్వం విఫలమైదంటూ టీడీపీ నేతలు ఏ స్థాయిలో అయితే విమర్సలు చేస్తున్నారో, అంతే స్థాయిలో చంద్రబాబు హైదరాబాద్ లో ఉంటూ, ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడం, పిచ్చిపిచ్చి లేఖలు రాయడం మానుకోవాలని వైసీపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. అసలు లాక్ డౌన్ నేపథ్యంలో చంద్రబాబు, తన ఇంటి వద్ద ఉండిపోయిన విషయం తెలిసిందే.

 

దీంతో ఆయన అక్కడ నుంచే కరోనా కట్టడి చేయడానికి ఏపీ ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇస్తున్నారు. అలాగే పలు సమస్యలపై కూడా ప్రభుత్వానికి లేఖలు కూడా రాస్తున్నారు. అయితే హైదరాబాద్ లో ఇంద్రభవనంలో ఉంటూ లేఖలు రాయడం కాదని, ఏపీ వచ్చి ప్రజలకు అండగా ఉండాలని వైసీపీ నేతలు చెబుతున్నారు. మళ్ళీ చంద్రబాబు ఏపీకి వస్తే 14 రోజులు క్వారంటైన్ లోనే ఉండాలని అంటున్నారు.

 

తాజాగా కూడా వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు, చంద్రబాబుపై కొన్ని కామెంట్లు చేశారు. కరోనా వ్యాప్తి పెరుగుతుందని తెలిసి చంద్రబాబు హైదరాబాద్ పారిపోయారని, కరోనాకు వ్యాక్సిన్‌ కనిపెట్టేవరకు ఆయన హైదరాబాద్ వదలి వస్తారా రారా సమాధానం చెప్పాలని, ఇంకా కరోనా పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండలాని సీఎం చెబితే, ఆయన మాటలను వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు.

 

ఇక అంబటి చేసిన వ్యాఖ్యలకు టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా కౌంటర్లు ఇస్తున్నారు. అంబటి కబుర్లు బాగా చెబుతారని, మొన్నటివరకు కరోనా లేదు ఎన్నికలు కావాలన్న ఈయన, ఇప్పుడు కరోనా ఉందని చంద్రబాబు పారిపోయారని మాట్లాడుతున్నారని ఎద్దేవా చేస్తున్నారు. అయినా అంబటి మాటల్లో లాజిక్ మిస్ అయిందని, ఏపీ నుంచి పారిపోతే, హైదరాబాద్ లో కరోనా లేదా? అని ప్రశ్నిస్తున్నారు. అంటే ఏపీలో బాగా ఎక్కువగా ఉందని ఒప్పుకుంటున్నారని అంటున్నారు.

 

ఆయన ఏపీకి వచ్చిన ఇంట్లో ఉండే సలహాలు, సూచనలు ఇవ్వాలని, అలాంటప్పుడు ఎక్కడ ఉంటే ఏంటి? అని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ బాబు లేకపోతే మీరు ఉండలేకపోతే చెప్పండి, ఆయనని ఎలాగోలా ఏపీకి తీసుకొస్తామని సెటైర్లు వేస్తున్నారు. ఇక కరోనాతో కలిసి జీవించాలని సీఎం చెప్పిన వ్యాఖ్యల్లో అసలు అర్ధం ఉందా? అని అడుగుతున్నారు. పైగా ర్యాపిడ్ టెస్ట్ కిట్లు దక్షిణ కొరియా కాకుండా దక్షిణాఫ్రికా నుంచి వచ్చాయని చెప్పి గొప్ప జ్ఞానంతో మాట్లాడిన మీరు, ఇప్పుడు చంద్రబాబుని ప్రశ్నించడం విడ్డూరంగా ఉందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: