ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా  వైరస్ ప్రభావం పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ నియంత్రణకు ప్రభుత్వం ఎన్నో విధాలుగా చర్యలు చేపడుతూనే ఉన్నారు. వైరస్ బారిన పడిన వారికి మలేరియా  మందైనా హైడ్రోక్సీక్లోరోక్విన్  ద్వారా చికిత్స అందిస్తోంది. ఎందుకంటే కరోనా  వైరస్ వెలుగులోకి వచ్చి నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఈ మహమ్మారి వైరస్ కి ఎలాంటి విరుగుడు అందుబాటులోకి రాకపోవడం దీనికి కారణం. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా  వైరస్ రోగులకు  ఓవైపు హైడ్రోక్సీక్లోరోక్విన్  అనే మందును వాడుతూ పోరాటం చేస్తూనే మరోవైపు... బయట ప్రాంతాలలో ఉన్న  వైరస్ ను  అంతం చేసేందుకు ఎన్నో ప్రత్యామ్నాయ చర్యలు కూడా చేపడుతున్నారు. 

 

 లాక్ డౌన్ లో అన్ని ప్రాంతాలలో  కొన్ని రకాల రసాయనాలను తయారు చేసే విధంగా పట్టణాలు నగరాలలో చళ్ళుతున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఏకంగా లక్షల రూపాయలు ఖర్చు చేసి ఈ రసాయనాలను తయారు చేసి  నగరాలు పట్టణాల్లో ప్రతి వీధిలో  చల్లుతున్నారు. మరి ఈ రసాయనాల ద్వారా కరోనా  వైరస్ ప్రభావం తగ్గుతుంది అనేదానిపై విశ్లేషకులు మాత్రం ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. డ్రోన్ కెమెరా ల ద్వారా ఆంధ్రప్రదేశ్లోని రాజ్ భవన్ లో  ఈ రసాయనాలను చల్లినప్పటికీ అక్కడ  వైరస్ బారిన పడ్డారు. అంతేకాకుండా చాలా చోట్ల ఈ రసాయనాలను చల్లినప్పటికీ కూడా చాలామంది మహమ్మారి వైరస్ బారినపడి చికిత్స తీసుకుంటున్నారు. 

 


 ఇక రెడ్ వున్న ప్రాంతాల్లో అయితే ఈ రసాయనాలను ఎక్కువ మొత్తంలో స్ప్రే చేస్తున్నారు అధికారులు. అయితే కరోనా  వైరస్ కు  వ్యాక్సిన్ లేదు కాబట్టి ప్రత్యామ్నాయ చర్యల్లో  భాగంగా ఏం  చేసిన మేలే  కదా అని అనుకోవడంలో తప్పులేదు కానీ... రసాయనాలు అసలు ఈ మహమ్మారి వైరస్ ను  అంతం చేయడానికి ఉపయోగపడుతుంద లేవా అనే విషయాన్ని కూడా అధికారులు గ్రహించాలి అని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: