జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుండి అతని ప్రభుత్వం ఎడ్డెం అంటే తెడ్డెం అన్నట్లు వ్యవహరిస్తూనే ఉన్నారు. జగన్ తీసుకున్న ఒకటి రెండు నిర్ణయాలను సపోర్ట్ చేసిన పవన్ దాదాపు అతని ప్రభుత్వం చేపట్టిన అన్ని కార్యక్రమాలను విపరీతంగా విమర్శించాడు. ఇక మూడు రాజధానులు విషయంలో అయితే ఒక రేంజ్ లో రెచ్చిపోయాడు కానీ చాలా రోజుల తర్వాత మొట్టమొదటిసారిగా జనసేన అధినేత ఏపీ ప్రభుత్వ పనితీరుని మెచ్చుకున్నాడు.

 

వివరాల్లోకి వెళితే ఇప్పుడు కరోనా దెబ్బకు విధించిన లాక్ డౌన్లోడ్ వల్ల రాష్ట్రంలో అంతా చాలా విపరీతంగా బాధపడుతున్నారు. ఇక పక్క రాష్ట్రాల్లో చిక్కుకున్న వారి సంగతి అయితే వర్ణనాతీతం. ఇదే క్రమంలో గుజరాత్ తీరానికి చేపల వేటకు వెళ్లిన ఉత్తరాంధ్ర మత్స్యకారులు అక్కడే చిక్కుకుపోయారు. దాదాపు వారి సంఖ్య 3800 ఉండగా వారికి ఎక్కడా తినడానికి తిండి కూడా లేక నానా అవస్థలు పడ్డారు. ఇదే సమయంలో కేంద్ర హోం శాఖ మంత్రి కిషన్ రెడ్డి చొరవతో సొంత ఊర్లకు పంపే ప్రయత్నాలు కూడా జరిగాయి.

 

అందులో భాగంగా వారిని తరలించడానికి గుజరాత్ ప్రభుత్వం 200 బస్సులు సిద్ధం చేయగా ముందుగా కొన్ని ప్రత్యేకమైన బస్సుల్లో కొంతమందిని తరలించడం జరిగింది. దీని కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే స్పందించి ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మూడు కోట్ల రూపాయలను విడుదల చేయడం గమనార్హం.

 

సందర్భంగా పవన్ కళ్యాణ్ బీజేపీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు. సొంత ఊర్లకు ఉత్తరాంధ్ర మత్స్యకారుల ను తరలించడానికి సహాయపడిన  కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి కి అలాగే హోం శాఖ మంత్రి అమిత్ షా కి, విజయ్ రూపాణి లకు కృతజ్ఞతలు. అలాగే ఇందుకోసం నిధులు విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తున్నాను అని సోషల్ మీడియాలో మెచ్చుకున్నారు పవన్ కళ్యాణ్.  

మరింత సమాచారం తెలుసుకోండి: