కరోనా వైరస్ కట్టడి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ వల్ల అనేక మంది తీవ్ర అవస్థలు పడుతున్నారు. దేశవ్యాప్తంగా అన్ని రంగాలు క్లోజ్ కావడంతో చాలామంది ఎక్కడి వారు అక్కడ ఆగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సందర్భంలో ఎక్కువగా వలస కూలీలు, దేశవ్యాప్తంగా భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొన్నారు. సొంత ఊరు వదిలి పెట్టి పని కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లి లాక్ డౌన్ అయి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎక్కడి వారు అక్కడ ఇరుక్కోవడంతో రవాణా సౌకర్యం కూడా ఆగిపోవడంతో అనేక మంది వలస కూలీలు పొట్ట చేతబట్టుకుని కొన్ని వేల కిలోమీటర్లు నడుచుకుంటూ మధ్యలోనే ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.

 

ఇటువంటి పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా వలస కార్మికుల కోసం మూడు రోజులు రైలు తీప్పాలనే డిమాండ్ వినబడుతోంది. అయితే ఈ విధంగా ఉంటే 25 లక్షలు ఖర్చు పెట్టి ఇంటికి వెళ్ళాడు ఒక వ్యక్తి. పూర్తి వివరాల్లోకి వెళితే ముంబై విమానాశ్రయం లో పనిచేస్తున్న ప్రేమ్ మూర్తి పాండే ఉత్తరప్రదేశ్ లోని కోట్వా ముబారక్ గ్రామం కి వెళ్ళటానికి అదిరిపోయే స్కెచ్ వేశాడు.  ప్రేమ్ మూర్తి పాండేకు రవాణా సేవలు ఎలా పనిచేస్తాయో బాగా తెలుసు.

 

ప్రజలు ప్రయాణించడాన్ని నిషేధించినప్పటికీ అవసరమైన వస్తువులను రవాణా చేయడానికి ఎటువంటి పరిమితులు లేవని తెలుసు. ఇదే అంశాన్ని ఉపయోగించుకొని ఇంటికి చేరుకోవాలనుకున్నాడు. ఈ కారణంగానే ప్రేమ్ మూర్తి పాండే తన ఇంటికి చేరుకోవడానికి ఉల్లిపాయ వ్యాపారిగా మారి నాసిక్ లోని పింపాల్ గావ్ లో మినీ ట్రక్కును అద్దెకు తీసుకుని  పింపాల్ గావ్ మార్కెట్ నుంచి రూ. 22.32 లక్షలకు 25.5 టన్నుల ఉల్లిపాయలను కొనుగోలు చేసి ప్రయాణం స్టార్ట్ చేశాడు. మధ్యలో చాలా చెక్ పోస్టులు ఉన్నాగాని ఎవరు ఆపలేదు. ఇంటి దగ్గర ఉన్నవారు అందరూ షాక్ అయ్యిపోయారు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: