ఆమె ఓ ఎన్నారై.. పేరు వనీజా రూపాని.. వయస్సు 17 ఏళ్లు.. ఇప్పుడు ఆమె ఏకంగా నాసా మెప్పు సంపాదించింది. నాసా అంగారక గ్రహంపై ఉపయోగించే తమ తొలి హెలికాఫ్టర్ కు ఏం పేరు పెట్టాలో ఈ అమ్మాయి చెప్పేసింది. నాసా కూడా ఆమె చెప్పిన పేరునే ఖరారు చేసేసింది. ఎందుకంటే.. నాసా నిర్వహించిన నేమ్ ద రోవర్ పోటీలో వనీజా రూపానీ రాసిన వ్యాసం ఎంపికైంది.

 

 

అందుకే ఈ హెలికాప్టర్ కు వనీజా సూచించిన ఇన్ జెన్యుటీ అనే పేరు పెట్టాలని నాసా నిర్ణయించింది. ఈ ఇన్ జెన్యుటీ మరో ప్రపంచంలో ఎగరనున్న శక్తివంతమైన హెలికాఫ్టర్ గా నాసా ప్రకటించింది. రోవర్ తో పాటే ఈ హెలికాఫ్టర్ ను జులైలో అంగాకరక గ్రహంపైకి నాసా పంపనుంది. అవి రెండూ వచ్చే ఏడాది ఫిబ్రవరికి అంగారకుడిపైకి చేరతాయి.

 

 

ఈ పోటీ మామూలుగా జరగలేదు. అమెరికా మొత్తం నుంచి 28 వేల మంది 12వ తరగతి విద్యార్థులు తమ పేపర్లు సబ్మిట్ చేశారు. అన్ని వేల వ్యాసాల నుంచి రూపానీ వ్యాసం ఎంపికైంది. ఆమె సూచించిన ఇన్ జెన్యుటీ పేరు ఖరారైంది. మానవ మేథస్సు కలిసి గ్రహాంతర ప్రయాణ సవాళ్లను అధిగమిస్తుందని అంతరిక్ష అద్భుతాల అన్వేషణలో అవకాశాలను కల్పిస్తుందని రూపాని తన పేపర్లలో రాసింది. తన వ్యాసం ఎంపికవడం పట్ల 17 ఏళ్ల ఈ నార్త్ పోర్ట్ కు చెందిన 17 ఏళ్ల భారత సంతతి బాలిక వనీజా ఆనందం వ్యక్తంచేసింది.

 

 

ఇక మరో విషయం ఏటంటే.. అంగారకుడిపైకి పంపించే తదుపరి రోవర్ కు పెర్జెవరన్స్ అనే పేరు పెట్టింది. మార్చిలో నిర్వహించిన వ్యాస రచన పోటీలో విజయం సాధించిన ఏడో తరగతి బాలుడు అలెంగ్జాండర్ మాథర్స్ సూచన మేరకు ఆ పేరును ఖరారు చేసింది.మొత్తానికి భారత సంతతికి చెందిన ఎన్నారై అమ్మాయి తన సత్తా చాటిందన్నమాట.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: