కరోనా అన్ని దేశాలకంటే అమెరికాలోనే తన ప్రభావాన్ని అధికంగా చూపిస్తుంది.. ఈ విషయంలో ట్రంప్ చైనా పై ఎన్నో అనుమానాలు తెలియచేస్తున్నారు.. ఒక రకంగా అసలు చైనాలో పుట్టిన ఈ వైరస్ బారి నుండి ఆ దేశం ఇంత త్వరగా బయటపడటం.. చాలా తక్కువగా ప్రాణ నష్టం జరగడం తదితర విషయాల్లో ట్రంప్ ప్రపంచానికి ఇంత ముప్పు వాటిల్లడానికి ముమ్మాటికి చైనా తీసుకున్న నిర్ణయం వల్లే అని బల్లగుద్ది మరీ చెబుతుండగా.. చైనా మాత్రం ఈ వైరస్ మేము పుట్టించలేదు బాబో అని ఎప్పటికప్పుడు ట్రంప్ విసిరే సవాళ్లను తిప్పికొడుతుంది..

 

 

ఇప్పటికే ఎన్నో సార్లు చైనా పై ట్రంప్ మండిపడ్డారు.. తాజాగా మరోమారు చైనాపై విరుచుకుపడ్డారు డొనాల్డ్ ట్రంప్. ఇకపోతే ఇప్పటివరకు చైనాపై విమర్శలు మాత్రమే చేసిన ట్రంప్.. తాజాగా అధ్యక్ష పదవి ఎన్నికలకు, చైనాకు ముడిపెడుతూ పలు ఆరోపణలు చేశారు. అదేమంటే అధ్యక్ష ఎన్నికల్లో తనను ఓడించడానికి చైనా వేసిన ఎత్తు ఈ కరోనా అని.. అందుకు కరోనా అంశంలో చైనా ప్రవర్తించిన తీరే దీనికి ఉదాహరణ అని పేర్కొన్నారు.. చైనా వల్లే ఈ కరోనా ప్రపంచమంతా వ్యాప్తి చెందింది. ముఖ్యంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ క్షీణించడానికి, ఇప్పటి వరకు దాదాపుగా అరవై వేల మంది మరణించడానికి కారణం చైనానే అని ఇంతటితో ఆగకుండా ప్రజా సంబంధాలను అడ్డుపెట్టుకుని తాము అమాయకులమని చెప్పుకునే ప్రయత్నం ఆ దేశం చేస్తుందని వాఖ్యానించారు..

 

 

మరోపక్క అమెరికాలో ఇన్ని మరణాలు సంభవించడానికి ట్రంప్ నిర్లక్షంగా ఉండటమే కారణమని చైనా ఆరోపిస్తూ తమ దేశం పై చేసిన ఆరోపణలను కొట్టిపడేస్తున్నారు. ఇకపోతే అమెరికా వాదన చూస్తే చైనా ప్రభుత్వమే కరోనా వ్యాప్తి జరుగుతున్న సమయం లో దీని గురించి ప్రపంచదేశాలకు హెచ్చరించాల్సి ఉండాలని, మరోపక్క చైనాపై వాణిజ్య, ఇతర ఒప్పందాలకు సంబంధించి తాను పెట్టిన ఒత్తిడిని తొలగించేందుకు ప్రయత్నిస్తు తన పై కుట్రలు పన్నుతుందని ట్రంప్ తెలియచేస్తున్నారు..

 

 

ఇదే కాకుండా ఈ సంక్షోభం కారణంగానే వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో తాను ఓడిపోయి డెమొక్రటిక్ అభ్యర్థి జో బిడెన్‌ గెలవాలని చైనా కోరుకుంటోందన్నారు... మీరు మీరు కొట్టుకుని చావండి గాని మిగతా దేశాలు ఏం పాపం చేసాయని మీ ఆధిపత్య పోరులోకి లాగారు.. అంతగా కావాలంట ఏ విప్లవం గానీ మరేదైనా యుద్ధం గాని చేయాలనుకుంటే అందులోకి ఇతర దేశాలను లాగకుండా చావండని కరోనాతో కడుపులు కాలుతున్న నెటిజన్స్ దుమ్మెత్తి పోస్తున్నారట.. 

మరింత సమాచారం తెలుసుకోండి: