ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా వైరస్ గురించి ఎన్నో పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఎవరికీ  వైరస్ సోకే అవకాశం ఎక్కువగా ఉంది ఎవరికి తక్కువగా ఉంది అనే దానిపై కూడా ఎన్నో పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిశోధనలలో రోజుకో కొత్త విషయం బయట పడుతూనే ఉంది. ఇదిలా ఉంటే అటు ఈ మహమ్మారి వైరస్ కు విరుగుడు కనుగొనేందుకు కూడా ప్రపంచ వ్యాప్తంగా మహా మహా శాస్త్రవేత్తలు సైతం ఎన్నో పరిశోధనలు చేస్తున్నారు. కానీ ఎక్కడా ఫలితం మాత్రం లభించడం లేదు. దీంతో ఈ మహమ్మారి వ్యాధికి  నివారణ ఒక్కటే మార్గం అయింది. ఇక ఈ మహమ్మారి వైరస్ ప్రభావం ఎవరిపై ఎక్కువగా ఉంటుంది అనే దానిపై తాజా పరిశోధనలో ఓ ఆసక్తికర విషయం వెల్లడయింది. 

 

 

 పొగతాగే వారిలో ఎక్కువగా కరోనా  వైరస్ ముప్పు ఉంటుంది అని అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియా యూనివర్శిటీ నిర్వహించిన అధ్యయనంలో ఆసక్తికర విషయం వెల్లడయింది. ధూమపానం అలవాటు లేని వారితో పోల్చి చూస్తే ధూమపానం అలవాటు ఉన్నవారు కరోనా వైరస్ బారిన ఎక్కువగా పడతారని ఈ అధ్యయనంలో తేలినట్లు పరిశోధకులు వెల్లడించారు. ఇక ఈ అధ్యయనం కోసం పొగతాగని వారిని పొగతాగే వారిని పరీక్షించామని... వారి ఊపిరితిత్తుల కణజాలాల్లో ఉన్నా రైబో న్యూక్లిక్ ఆసిడ్ డేటాను విశ్లేషించి ఈ అధ్యయనాన్ని జరిపినట్లు పరిశోధకులు వెల్లడించారు. 

 

 

 ఈ సందర్భంగా శ్వాస మార్గం లోని వైరల్ ఇన్ఫెక్షన్కు గురయ్యే ఏసీఈ2,  ప్యూరిన్, టిఎంపిఆర్ఎస్  ఎస్2  కణజాలాలను ఈ అధ్యయనంలో క్షుణ్ణంగా పరిశీలన చేసినట్లు తెలిపారు. ఇక వీటిని పరిశీలించిన అనంతరం అధ్యయనంలో ఏమి తేలింది అంటే పొగ తాగని వారితో పోలిస్తే పొగతాగే అలవాటు ఉన్న వారిలోనే ఎక్కువగా వైరస్ ముప్పు ఉంది అని పరిశోధకులు తెలిపారు. తక్కువలో తక్కువ కనీసం వంద సిగరెట్లు తాగేవారి ఊపిరితిత్తుల కణజాలాలు కూడా వైరస్ బారిన పడే అవకాశం 25% ఎక్కువగానే ఉంటుంది అనే విషయాన్నీ  అధ్యయనంలో తాము గుర్తించినట్లు పరిశోధకులు వెల్లడించారు. అయితే ఇది ధూమపాన ప్రియులకు ఒక హెచ్చరిక లాంటిదే అని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: