ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా కరోనా  వైరస్ మహమ్మారి గురించి భయం పట్టుకున్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఈ మహమ్మారి వైరస్ తెర మీదికి వచ్చి నెలలు గడుస్తున్నప్పటికీ ఈ వైరస్కు విరుగుడు మాత్రం కనుగొనలేకపోయారు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పరిశోధనలు జరుగుతున్నప్పటికీ ఎక్కడ ఫలితం మాత్రం లేకుండా పోయింది. దీంతో వివిధ వ్యాధులకు సంబంధించిన మందులనే ఈ మహమ్మారి వైరస్ కు విరుగుడు గా వాడుతూ ప్రస్తుతం చాలా మందికి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే భారతదేశంలో మలేరియా వ్యాధికి సంబంధించిన హైడ్రోక్సీక్లోరోక్విన్  అనే మందును కరోనా  నివారణ కోసం వాడుతున్న విషయం తెలిసిందే. 

 

 

 ఇక తాజాగా కరోనా వైరస్ బారినపడి ఆరోగ్యం పరిస్థితి విషమంగా ఉన్నవారికి కీళ్లనొప్పుల ఔషధం మెరుగైన ఉపయోగపడుతుందని తాజాగా ఓ అధ్యయనంలో వెల్లడైంది. పారిస్ యూనివర్సిటీ హాస్పిటల్ ట్రస్ట్ పలువురు కరోనా  బాధితులపై నిర్వహించిన ప్రయోగం ఆధారంగా... ఈ విషయాన్ని ప్రకటించింది. అయితే ఈ ఔషధం ఎంతమేరకు కరోనా  వైరస్ పేషెంట్ లపై ప్రభావం చూపుతూ మహమ్మారి పై పోరాటం చేస్తుంది అనేది స్పష్టంగా  గుర్తించడానికి తదుపరి పరిశోధన అవసరం అంటూ స్పష్టం చేస్తోంది. అయితే కరోనా  వైరస్ సోకిన వారిలో 5 నుంచి 10 శాతం మంది పేషెంట్లు నిమోనియా వ్యాధి కి కూడా గురవుతున్న విషయం తెలిసిందే. 

 

 

 వీరిలో రోగనిరోధక శక్తి తక్కువగా అయిపోయి ప్రోటీన్ విపరీతంగా పెరిగిపోయి శరీరానికి తగినంత ఆక్సిజన్ అందక క్లిష్ట  పరిస్థితి ఏర్పడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇలా జరగడం కారణంగా పరిస్థితి విషమించి మరణానికి దారితీస్తుంది అని చెబుతోంది. ఇలా పరిస్థితి విషమించిన  కరోనా  బాధితులకు కీళ్లనొప్పుల ఔషధం అయినా టోసిలి జుమాట్  అనే మందు మెరుగ్గా ఉపయోగపడుతున్న ట్లు తాజాగా ఓ అధ్యయనంలో గుర్తించినట్లు పరిశోధకులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: