డ్రాగ‌న్ కంట్రీపై అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ త‌న ఆరోప‌ణ‌ల ప‌రంప‌ర‌ను కొన‌సాగిస్తూనే ఉన్నారు. కోవిడ్ -19ను ముమ్మాటికి చైనానే సృష్టించింద‌ని చెబుతున్నారు. చైనాలోని వూహాన్ న‌గ‌రంలోని వైరాల‌జీ ల్యాబ్ నుంచే క‌రోనా పుట్టుక మొద‌లైంద‌ని ట్రంప్ తాజాగా వ్యాఖ్య‌లు చేయ‌డమే కాదు...అందుకు సంబంధించిన ఆధారాలు కూడా త‌మ వ‌ద్ద ఉన్నాయ‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం.
కొవిడ్‌-19 కారక కరోనా వైరస్‌ మానవుల సృష్టి కాదని అమెరికా నిఘా సంస్థలు స్పష్టం చేసిన కొన్ని గంటల్లోనే  ట్రంప్ ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం ఇప్పుడు  ప్ర‌పంచ దేశాల దృష్టిని అటు వైపు మ‌ళ్లిస్తోంది. 

 

అయితే వాటికి సంబంధించిన ఆధారాలు, వివ‌రాల‌ను మ‌రింత విశ్లేషించిన త‌ర్వాత బ‌హిర్గ‌తం చేస్తామ‌ని ట్రంప్  చెప్పారు. వుహాన్‌ ల్యాబ్‌ నుంచే వైరస్‌ బయటకు వచ్చిందని మీరు బ‌లంగా చెప్ప‌డానికి ప్రాథ‌మిక ఆధారాలు న్నాయ‌ని ప్ర‌జ‌లు ఎలా న‌మ్మ‌గ‌ల‌రు అంటూ ఓ విలేఖ‌రి ప్ర‌శ్నించ‌గా  ‘‘నేను ఆ విషయాలు బయటకు చెప్పలేని ప‌రిస్థితిలో ఉన్నాను. ఇలాంటి విష‌యాల‌పై ఆచితూచి స్పందించ‌డం ఎంతో అవ‌స‌రం.  వాస్త‌వానికి ఆ ఆధారాల గురించి చెప్పడానికి కూడా నాకు అనుమతి లేదు’’ అంటూ  ట్రంప్‌ వ్యాఖ్యానించడం విశేషం.  వైర‌స్ విష‌యం దాచి చైనా చాలా పెద్ద త‌ప్పు చేసింద‌ని అన్నారు.

 

 దాని ఫ‌లితంగా నేడు ప్ర‌పంచ‌మంతా అల్ల‌క‌ల్లోలం కాబ‌డుతోంద‌ని అన్నారు. ఇదిలా ఉండ‌గావైర‌స్ సృష్టించింది చైనాయేన‌ని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ‌రుస‌గా విమ‌ర్శ‌లు చేస్తూ వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఈ విష‌యంపై చైనా స్పందించించి. యూఎస్ అధికారిక వ‌ర్గాలు చైనాపై దుష్ర్ప‌చారం మొద‌లుపెట్టాయ‌ని ఎదురు దాడికి సిద్ధ‌మ‌వుతోంది. అమెరికాలో వైర‌స్‌ను క‌ట్ట‌డి చేయ‌డంలో ట్రంప్ ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌ని, అక్క‌డి జనాల‌ను దృష్టి మ‌ర‌ల్చేందుకే అధ్య‌క్షుడు ట్రంప్ ప‌దేప‌దే చైనాను తిడుతూ..వైర‌స్ సృష్టించార‌ని చైనాపై ఆరోప‌ణ‌లు చేస్తున్నాడ‌ని  పేర్కొంది. మాన‌వ‌లోకానికి హాని త‌ల‌పెట్టే ప‌నిని చైనా ఏనాటికి చేయ‌ద‌ని, అలాంటి అవ‌స‌రం కూడా త‌మ‌కు లేద‌ని స్ప‌ష్టం చేసింది.

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: