ప్రస్తుతం దేశంలో లాక్ డౌన్ పుణ్యమా అని ఎవరి ఇంట్లో వారు అందరూ ఉండిపోయారు. దీనితో రోడ్లు నిర్మానుష్యంగా మారాయి అని చెప్పవచ్చు. అంతేకాకుండా కొన్ని అడవి ప్రాంతాల్లో జంతువులు రోడ్ల మీదకు వచ్చి స్వేచ్ఛగా వాటి జీవనాన్ని కొనసాగిస్తున్నాయి. కానీ అయితే ఇక రెండు రోజుల్లో దేశం మళ్ళీ తిరిగి మాములు స్థాయికి చేరుకుంటే మళ్ళీ వాళ్ళ తిప్పలు తప్పేలా లేవు పాపం....!

 

అయితే ఇక అసలు విషయానికి వస్తే... చిరుత పులి, వాటి పిల్లల అందమైన వీడియో ఇప్పుడు ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో మంచి ట్రెండింగ్ వీడియోగా సాగుతోంది. సుమారు 20 సెకండ్ల పాటు నిడివి ఉన్న ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంత్ నందా ఈ వీడియోను షేర్ చేశారు. ఇక ఈ వీడియో ఫుటేజ్ లో తల్లి చిరుత పులి తన ఇద్దరు పిల్లలతో ఆడుతోంది. అయితే ఈ వీడియోను అడవిలో చిత్రీకరించినట్లు క్లియర్ గా కనిపిస్తోంది. అయితే ఈ వీడియోని చూస్తే " మీరు ప్రేమను చూడలేరు లేదా వినలేరు" అన్నట్లుగా ఉంది ఈ వీడియో. నిజానికి అందరి హృదయాల్లో ఈ భావన కలిగిస్తుంది ఈ వీడియో చూస్తే.

 

" మీరు ప్రేమను చూడలేరు లేదా వినలేరు" అంటూ ఒక క్యాప్షన్ తో సుశాంత్ ఫోసెట్ ఆ ట్వీట్ చేశారు. అయితే ఈ వీడియోను చాలామంది పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. అంతేకాకుండా ఈ వీడియోకు సంబంధించిన ట్విట్టర్ ను రీట్వీట్ కూడా చాలామంది చేశారు. వన్య ప్రాణుల మీద ప్రేమతో సుశాంత్ వీటిని షేర్ చేయడం జరిగింది. ఏది ఏమైనా తల్లి ప్రేమ అనేది అన్ని జీవులలో ఒకటేనని ఈ వీడియో ఇంకొక సారి రుజువు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: