బీటి పత్తి విత్తన కంపెనీల ఆగడాలను కంట్రోల్ చేసేందుకు తెలంగాణ సర్కార్ అడుగులు వేస్తోంది. అందుబాటులో ఉన్నాయని సాగుచేసి ఆ తర్వాత  రైతులు ఇబ్బందులు పడుతుండటాన్ని గుర్తించిన ప్రభుత్వం.. దీనికి బ్రేక్ వేసే పనిలో పడింది.  బీటీ పత్తి విత్తనాలనే నమ్ముకొని సాగుచేసే రైతులను కాపాడేందుకు అవసరమైన వ్యవస్ధను  ఏర్పాటు చేస్తోంది వ్యవసాయ శాఖ.

 

రాష్ట్రంలో  బీటీ విత్తన కంపెనీలు   రైతుల పాలిట శాపంగా మారుతున్నాయి. అందుబాటులో ఉన్నాయి కదా... అని బీటీ విత్తనాలతో సాగుచేస్తున్న రైతులు చివరికి భారీగా నష్టపోతున్నారు. దిగుబడి గణనీయంగా తగ్గిపోయి.. పెట్టుబడులు కూడా పూడ్చుకోలేక అవస్ధలు పడుతున్నారు రైతులు. అంతేకాకుండా  విపత్తు వస్తే పరిహారం ఇవ్వడంలో బీటీ కంపెనీలు తీవ్ర నిర్లక్ష్యం చూపుతున్నాయి.

 

 పంట సాగుచేసే ముందు ఏటా మే, జూన్‌ మాసాల్లో  గ్రామాల్లోని స్థానిక నేతలు కంపెనీల తరఫున దళారులుగా మారి రైతులతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఇక ఏమైనా తేడాలొస్తే కంపెనిలు  తప్పించుకుని దళారుల ద్వారా రైతులను బెదిరిస్తోన్న ఘటనలు బయటపడ్డాయి. రైతులను రక్షించేందుకు వ్యవసాయ శాఖ ఈ సీజన్ నుంచి కొత్త రూల్స్ తీసుకువస్తోంది. వ్యవసాయదారులకు రక్షణగా సీడ్ కంపెనీ ప్రతినిధి, బ్రోకర్ , రైతు మధ్య త్రైపాక్షిక ఒప్పందం ఉండాలని వ్యవసాయ శాఖ డిసైడ్ చేసింది.

 

కొత్త నిబంధనల్లో భాగంగా  రైతు, కంపెనీ, దళారీ పూర్తి వివరాలు, భూమి విస్తీర్ణం, సాగు చేసే విత్తనాల వివరాలు ఉంటాయి. అగ్రిమెంట్  పై మూడు పార్టీలు సంతకం చేసి స్థానిక వ్యవసాయాధికారికి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ పత్రాలన్నీ సేకరించి రాష్ట్రవ్యాప్తంగా విత్తన పంటలపై వ్యవసాయశాఖ నిఘా పెడుతుంది. ఒక వేళ పంట సాగులో తేడా వస్తే  ఒప్పందం ప్రకారం రైతులకు పరిహారం ఇచ్చేలా చూడనుంది తెలంగాణ వ్యవసాయ శాఖ. అయితే ఈ వ్యవహరంలో దళరాలు లేకుండా చూడాలన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

 

తెలంగాణ రాష్ట్రంలో ఈ సీజన్‌లో 55 లక్షల ఎకరాల్లో బీటీ పత్తి వేస్తారని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఒక్కో ప్యాకెట్‌ ధరలో 330 రూపాయలు సాగుచేసిన రైతుకు కంపెనీ రాయల్టీగా చెల్లించాలి. అయితే కేవలం 4 కంపెనీలు మాత్రమే వివరాలు అందచేసాయి. విత్తన కంపెనీల వ్యవహారాల్లో పారదర్శకత తెచ్చి రైతులకు అండగా నిలబడాలనే..  త్రైపాక్షిక ఒప్పంద పత్రం తయారు చేసినట్లు వ్యవసాయశాఖ  చెబుతోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: