మోడీ అంటేనే అపరిమితమైన మేధావి అని అర్ధం. లేకపోతే గత ఆరేళ్ళుగా ఆయన గ్రాఫ్ ఎక్కడా చెక్కుచెదరకుండా ఉంటోంది. ఆయన ఏం చేసినా 138 కోట్ల మంది భారతీయులు జై అంటున్నారు. కష్టమైనా, నిష్టూరమైనా నీ వెనకే మేము అంటున్నారు. ఇంతలా దేశం మొత్తాన్ని ఆసేతు హిమాలచలం వరకూ ఒకే త్రాటి మీద నడిపించిన ఘనత ఈ మధ్య కాలంలో ఏ ప్రధానికీ లేదు.

 

ఇక మోడీ లాక్ డౌన్ విధించారు. కరోనా కట్టడికి ఇదే మందు అన్నారు. దానికి దేశంలోని ముఖ్యమంత్రులు, అన్ని రాజకీయ పార్టీలు అవును అనక తప్పని పరిస్థితి. మరో వైపు చూసుకుంటే అనేక  రాజకీయ పార్టీలు సిధ్ధాంతరిత్యా మోడీని వ్యతిరేకిస్తున్నా ఈ క్లిష్ట సమయంలో కలసి నడవకతప్పని సీన్ ఉంది. అయితే మోడీ ఎక్కడైనా దొరుకుతాడా అని దేశంలోకి విపక్షాలు ఎదురుచూస్తూనే ఉన్నాయి.

 

కానీ మోడీ అంతకు మించి తెలివి చూపిస్తున్నారు. దేశంలోని బీజేపీయేతర ముఖ్యమంత్రులతో ఆయన వీడియో సమావేశాలు పెడుతూ వారి సూచనల మేరకే లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లుగా చెబుతున్నారు.  ఇక ఇంతకంటే వేరే మార్గాలు ఉన్నాయేమో చెప్పాలని కూడా మోడీ అడుగుతున్నారు. మొత్తానికి అంతా కలసి తీసుకుంటున్న నిర్ణయాలుగానే లాక్ డౌన్ వంటి కఠినమైన డెసిషన్లు కూడా చలామణీ అయిపోతున్నాయి.

 

ఇక లాక్ డౌన్ తరువాత పరిస్థితి ఏంటి అన్నది అందరిలో ఉంది. దీనికి కూడా మోడీ మార్క్ లెక్కలు ఉన్నాయి. దేశంలో నలభై రోజుల పాటు లాక్ డౌన్ అమల్లో ఉండడం వల్ల ఆర్ధికంగా అన్ని రాష్ట్రాలు కుదేల్ అయిపోయాయి. కేంద్రం వైపు సాయం కోసమే అవి  ఎదురుచూస్తున్నాయి. అయితే మోడీ లాక్ డౌన్ సడలింపుల విషయంలో కూడా రాష్ట్రాల చాయిస్ కే వదిలేస్తున్నారు.

 

అంటే లాక్ డౌన్  అక్కడి పరిస్థితుల బట్టి వారు కొనసాగించుకుంటే ఆర్ధిక కష్టాలు, నష్టాలు కూడా వారే భరించాలన్న మాట. నిజంగా ఇది ఇబ్బందికరమే. కేంద్రం సాయం చేస్తుందని చూస్తున్న రాష్ట్రాలకు, రాజకీయ పార్టీలకు మోడీ తనదైన మార్క్  షాక్ ఇచ్చారని అంటున్నారు. ఈ దెబ్బతో సత్తువ లేని రాష్ట్రాలు కరోనని కంట్రోల్ చేస్తూనే లాక్ డౌన్ని సడలించుకోవాల్సివస్తోంది. మొత్తం మీద చూసుకుంటే కేంద్రం నుంచి పెద్దగా ఆశించవద్దు అని మోడీ పెదవి విప్పకనే చెప్పేస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: