భారత్ అభివ్రుధ్ధి చెందుతున్న దేశం. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఇలా ముందుకు వచ్చింది. ఆర్ధిక మాంద్యాలను సైతం సునాయాసంగా దాటుకుని దూసుకుపోయిన సత్తా భారత్ కి ఉందని 2008 నాటి పరిణామాలు రుజువు చేశాయి. అయితే భారత్ ఇపుడు కీలకమైన ఘట్టంలో ఉంది. కరోనా మహమ్మారి ఒక్కో దేశాన్ని వణికిస్తున్న నేపధ్యం మరో వైపు ఉంది. 

 

ఇక చైనాను దోషిగా చూస్తూ అమెరికా రెచ్చిపోతోంది. చైనా వల్లనే ప్రపంచం ఇంతటి పెను విపత్తుని ఎదుర్కొంటోందని కూడా అమరికా ప్రెసిడెంట్ ట్రంప్ గట్టిగానే చెబుతున్నారు. మిగిలిన దేశాలు మౌనంగానే ఉన్నా మనసులో అందరి అభిప్రాయం కూడా ఇదేనని అంటున్నారు. ఇక చైనా విషయం ఇదివరకులా కధ సాఫీగా  నడవదు అని కూడా అంటున్నారు.

 

ప్రపంచ  వాణిజ్య మార్కెట్ లో తన వాటాను గతంలో అరవై శాతం ఉంటే దాన్ని భారీగా చైనా కోల్పోతుందని అంటున్నారు. దక్షిణాసియాలో చైనా ప్లేస్ భారత్ కి వస్తుందని కూడా విశ్లేషణలు ఉన్నాయి. చైనాని ఇప్పట్లో ఏ దేశమూ నమ్మకంపోవడం భారత్ కి అనుకోని వరం అవుతోంది.

 

అయితే అమెరికాలో సాధారణ  ఎన్నికలు ఉన్నాయి. ట్రంప్ అక్కడ రెండవ సారి గెలిస్తే మాత్రం భారత్ కత్తికి ఎదురుండదు, ఇక ఆమెరికాలో మళ్ళీ ట్రంప్ గెలిచాడు అంటే అది చైనా పాలిట మరణ శాసనమేనని అంటున్నారు. ట్రంప్ ఏకంగా కొత్త ప్రపంచాన్నే స్రుష్టించాలనుకుంటున్నారు. ఆ ప్రపంచంలో సహజ మిత్రుడు, నమ్మకమైన భారత్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

 

రానున్న రోజుల్లో కలసికట్టుగా భారత్ అమెరికా ముందుకు సాగుతాయి. అది మరింత ఎక్కువగా జరగాలంటే మాత్రం ట్రంప్ గెలవడం భారత్ కి అనివార్యం. ఈ నేపధ్యం నుంచి చూసుకున్నపుడు భారత్ జాతకాన్ని అమరికన్లు రేపటి ఎన్నికల్లో గట్టిగ  రాస్తారని అర్ధమవుతోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

 

మరింత సమాచారం తెలుసుకోండి: