ప్రపంచాన్ని గడ గడలాడిస్తున్న కరోనా మహమ్మారి ఇప్పుడు ఎవరికీ మనశ్శాంతి లేకుండా చేస్తుంది. అన్ని దేశాల్లో మరణ మృదంగం మోగిస్తున్నది. కరోనా కాటుకు ఇప్పటి వరకూ 2లక్షల 28వేల 224 మంది మరణించారు. కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 32లక్షల, 20 వేల 268కి పెరిగింది. అమెరికాలో గత 24 గంటల్లో 2,053 మంది ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల వ్యవధిలో 2000 దాటి మరణాలు రికార్డవడం వరుసగా ఇది మూడవ రోజు. దీంతో అమెరికాలో మృతుల సంఖ్య 62,906కు చేరిందని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం తెలిపింది. అంతే కాదు  ప్రతి రోజు 2,000కు పైగానే మృతుల సంఖ్య నమోదవుతోంది. ఇక ఇటలీలో ఇప్పటివరకు 27,967 మంది మృతి చెందగా, స్పెయిన్‌లో ఇప్పటివరకు 24,543 మంది ప్రాణాలు కోల్పోయారు.

 

 

యూకేలో 26,771, ఫ్రాన్స్‌లో 24,376, జర్మనీలో 6,623, టర్కీలో3,174, ఇరాన్‌లో 6,028, బ్రెజిల్‌లో 6,006 మంది మృతి చెందారు. కరోనా వ్యాప్తి చెందకుండా లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. మీడియాకు చెందిన వారు వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నారు.  అయితే  వర్క్ ఫ్రమ్ హోం ఎంత సులభమో అంత కష్టంగా మారుతోంది. ఆఫీసే బెటర్రా బాబూ అని కొందరు నిట్టూర్పు విడుస్తున్నారు. ముఖ్యంగా న్యూస్ రీడర్లు, రిపోర్టర్ల బాధలు అన్నీ ఇన్నీ కాదు.  

 

మొన్న సూట్ వేసుకొని ప్యాంట్ వేసుకోకుండా వార్తలు చెప్పాడు. తాజాగా ఓ న్యూస్ రీడర్ లైవ్ లో ఉండగా అతని పెంపుడు కుక్క రావడం.. అల్లరి చేయడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఫాక్స్ టీవీలో వాతావరణ విషయాలను రిపోర్ట్ చేసే పాల్ డెలెగాట్టో  వార్తలు చెబుతున్న సమయంలో ఒక్కసారే తన పెంపుడు కుక్క వచ్చింది..అక్కడ నుంచి పొమ్మంటే ససేమిరా అనడంతో పాపం దానిగడ్డం నిమిరుతూ వార్తలు చెప్పాల్సిన పరిస్తితి నెలకొంది.  ఈ వీడియోపై ప్రశంసల వర్షం కురుస్తోంది.  వావ్ చాలా గొప్ప  వెదర్ రిపోర్ట్ ఇదే అని అంటున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: