కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించి దాదాపు నెల రోజులు గడిచిపోతున్న విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి వివిధ పనుల నిమిత్తం స్వదేశానికి వచ్చిన విదేశాలలో పని చేస్తున్న భారతీయులు ఇక్కడే చిక్కుకుపోయారు. భారతదేశానికి వచ్చిన తర్వాత లాక్ డౌన్  అమలు కావడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. ఎలాంటి విమాన సర్వీసులు అందుబాటులో లేవు . కనీసం రవాణా సర్వీసులు కూడా మూసివేయబడ్డాయి. ఈ నేపథ్యంలో అమెరికా లో పనిచేసే భారతీయులు చాలా మందికి భయం పట్టుకుంది. అమెరికాలో తమ ఉద్యోగాలు ఊడిపోకుండా కాపాడుకోవాలి అంటే తప్పనిసరిగా అమెరికాకు వెళ్లాల్సిందే. అయితే ప్రస్తుతం భారతదేశంలో అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపివేసిన నేపథ్యంలో అమెరికాలో ఉద్యోగాలు చేసే భారతీయులందరూ ప్రస్తుతం చార్టెడ్ ఫ్లయిట్ లను ఆశ్రయించాల్సిన  పరిస్థితి వస్తుంది. 

 

 

 

 అయితే చార్టడ్ ఫ్లయిట్  అంటే భారీగానే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఏకంగా తొమ్మిది లక్షల డాలర్లు దీని  కోసం ఖర్చు చేయాలి. ఈ నేపథ్యంలో భారత్ లో చిక్కుకున్న పలువురు ఓ నిర్ణయానికి వచ్చారు. అమెరికాలో ఉద్యోగం చేస్తూ పనుల నిమిత్తం వచ్చి లాక్ డౌన్  సమయంలో ఇక్కడ ఇరుక్కుపోయిన వారు అందరూ గ్రూప్   ఏర్పడింది. అవసరమైన నిధులను కూడా సమకూర్చుకుంటున్నారు. మొదట చార్టడ్ ఫ్లయిట్  బుక్ చేసుకోవడానికి ఎవరూ ముందుకు రారు అనుకున్నప్పటికీ..  అనూహ్యమైన స్పందన వచ్చింది అంటూ హైదరాబాద్ కు  చెందిన ఓ హెచ్ 1 బీ వీసా దారుడు  వ్యాఖ్యానించారు. 

 

 

 

 రెండేళ్ల నుంచి తన భార్య కుమారుడుతో  కాలిఫోర్నియా ఉంటునాన్నని  కుటుంబ సభ్యులను కలిసేందుకు భారత్ కి రాగా అదే సమయంలో ఇక్కడ లాక్ డౌన్  అమలు కావడంతో ఇక్కడ ఇరుక్కుపోయాము అంటూ తెలిపాడు . అలాంటి మరో వందమంది అలాగే చిక్కుకోవడంతో వారిని సంప్రదించి ఒక చార్టడ్  ఫ్లైట్  బుక్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాము  అంటూ చెప్పుకొచ్చాడు. అమెరికాలో మంచి ఉద్యోగం పోతుందేమో అని భయంతో అక్కడికి వెళ్ళడానికి ఎంత ఖర్చు చేయటానికి అయిన  ఎవరు వెనకాడడం లేదు అంటూ చెప్పుకొచ్చాడు. అటు టైమ్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన సర్వేలో కూడా చాలా మంది ఉద్యోగాలు కాపాడుకోవడానికి అమెరికా వెళ్లడానికి భారీగా  చేయడానికైనా సిద్ధంగా ఉన్నాము అని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: