భారత్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 35వేలు దాటిపోయింది. దేశంలో గడిచిన 24గంటల్లో 73 మరణాలు, 1,993 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.  దేశంలో లాక్ డౌన్ పకడ్బందీగా అమలవుతున్న కరోనా వ్యాప్తి మాత్రం ఏమాత్రం నియంత్రణలోకి రావడం లేదు  గత నెల 24 నుంచి దేశ వ్యాప్తంగా కరోనా కట్టడి చేయడానికి లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే.  కానీ.. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య, మరణాల రేటు పెరుగుతూనే ఉంది.   మహారాష్ట్రలో 459మంది చనిపోయారు.

 

గుజరాత్ లో 4,395 మందికి, ఢిల్లీలో 3,515 మందికి కరోనా సోకింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తర్ ప్రదేశ్ లలో కరోనా తీవ్ర ప్రభావం ఉందని కేంద్ర మంత్రిత్వ శాఖ పేర్కొంది. తాజాగా  చాలా రోజుల తర్వాత కేరళలో శుక్రవారం ఒక్కరు కూడా పాజిటివ్‌గా నిర్ధారణ కాలేదు.  శుక్రవారం ఒక్క పాజిటివ్‌ కేసు నమోదు కాలేదని దాంతో పాటు మరో తోమ్మిది మంది బాధితులు కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 392 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం వివిధ జిల్లాల్లో 102 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.  

 

మొత్తానికి ఇంత భయానక పరిస్థితుల్లో కేసులు నమోదు కోకపోవడం శుభసూచికం అంటున్నారు.  ఇదిలా ఉంటే  భారత దేశంలో మొదల కేరళా రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు నమోదు అయ్యాయి. అంతే వేగంగా కేసులు కూడా పెరిగిపోయాయి.. అక్కడ సీఎం తీసుకుంటున్న కఠిన చర్యలు.. లాక్ డౌన్ ఈ కరోనా వ్యాప్తని కట్టడి చేస్తుందని అంటున్నారు.  ఏది ఏమైనా ఇప్పుడు కేరళాలో కరోనా కేసు నమోదు కాలేదు.. ఇలా అన్ని రాష్ట్రాల్లో ఫలితాలు రావాలని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: