లాక్ డౌన్ సమయములో వలస కార్మికుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఉన్న చోట ఉండలేక కాలినడకనే శరణ్యంగా భావించి వందల కిలోమీటర్లు నడిచి వెళ్తున్నారు. పిల్లాపాపలతో నే కాదు ఆకలి దప్పిక తో సైతం కొన్ని వందల మైళ్ళు నడిచి వెళ్లటం తో ప్రభుత్వాలలో చలనం కలిగింది. అందుకే కేంద్రం వలస కార్మికులందరినీ సొంత ఊరు వెళ్ళడానికి అనుమతి ఇచ్చింది. వలస కార్మికులను స్వస్థలాలకు చేరటానికి సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇచ్చింది.

 

దీంతో ఆయా రాష్ట్రాలకు చెందిన వారందరినీ పంపించే విధంగా అన్ని రాష్ట్రాలలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. అధికారులు ఇప్పటికే వారికి సంబంధించిన వివరాలు సేకరిస్తూ వాహనాల ఏర్పాట్ల కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు బస్సులు ఏర్పాటు చేయగా మరి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ట్రైన్స్ రంగంలోకి దించాయి. దేశ వ్యాప్తంగా కొన్ని లక్షలమంది వలస కార్మికులు ఉండటంతో 2-దశల లాక్ డౌన్ ఈ సమయంలో అనేక అవస్థలు పడటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

 

మరోపక్క వలస కార్మికులకు సరైన మాస్కులు ఇవ్వకపోవటంతో పాటు గుంపులు గుంపులుగా పంపించడం తో ... వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని కొంతమంది అంటున్నారు. మోడీ గారు ఇది కరెక్ట్ పద్ధతి కాదని...వీరివల్ల విల్లా సొంత ఊరి వాళ్లకు వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామంతో మూడోదశ లాక్ డౌన్ ఇండియా అవకాశం ఉండొచ్చని మరోపక్క మేధావులు అంటున్నారు. 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple.

మరింత సమాచారం తెలుసుకోండి: