జగన్ అధికార పీఠం ఎక్కి దాదాపు ఒక సంవత్సరం కావొస్తుంది. ఈ సంవత్సర కాలంలో జగన్ ని లక్ష్యంగా పెట్టుకుని టీడీపీ విమర్శలు చేస్తూనే వస్తోంది. అధికారం కోల్పోయిన బాధతో చంద్రబాబు, జగన్ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ప్రతి పథకంపై విమర్శలు చేసారు. ఇక ప్రస్తుతం కూడా జగన్ కరోనా మహమ్మారిని అరికట్టేందుకు కృషి చేస్తున్న కూడా టీడీపీ నేతలు అర్ధంపర్ధం లేని విమర్శలు చేస్తున్నారు.

 

ఈ క్రమంలోనే తాజాగా వైసీపీ ఎమ్మెల్యేలు, నేతల వల్లే ఏపీలో కరోనా వైరస్ విస్తరిస్తోందని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఇక సీఎం జగన్ అధికారంలోకి రావడంతోనే రాష్ట్రంలో వ్యవస్థలు కుప్పకూలాయని, ఏడాదిగా రాష్ట్రంలో ఎవరూ సంతోషంగా లేరని, లాక్ డౌన్ పూర్తయిన తర్వాత కార్మికులు, పేదల కోసం ఉద్యమిస్తామని చెబుతున్నారు. అసలు జగన్ అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దరిద్రం పట్టిందని తీవ్రంగా మండిపడుతున్నారు.

 

అయితే టీడీపీ నేతలకు వైసీపీ కార్యకర్తలు కౌంటర్లు ఇస్తున్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఎన్ని సంక్షేమ పథకాలు అందించారో చెప్పాల్సిన పనిలేదని,  ఆ విషయం పథకాల వల్ల లబ్ది పొందిన జనంకు బాగా తెలుసని, అదేవిధంగా ఎన్నో దశాబ్దాలుగా రాష్ట్రాన్ని పట్టి పీడించే నిరుద్యోగ సమస్యకు చెక్ పెట్టారని గుర్తుచేస్తున్నారు. ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా చంద్రబాబు ప్రభుత్వంలో  వచ్చినట్లు అవినీతి ఆరోపణలు జగన్ ప్రభుత్వంపై రావడం లేదని, ఆ విషయం ప్రజలు కూడా గమనిస్తున్నారని అంటున్నారు. అలాగే ఇప్పుడు జగన్ కరోనాని కట్టడి చేస్తూనే, ప్రజలకు ఎలా అండగా ఉంటున్నారో తెలుసని టీడీపీకి కౌంటర్ ఇస్తున్నారు.

 

అయినా టీడీపీ నేతలు జగన్ ప్రభుత్వంపై ఎంత బురద జల్లే ప్రయత్నం చేయాలనుకున్న, వాటిని జనం నమ్మే పరిస్థితిలో లేరని చెబుతున్నారు. అసలు టీడీపీ గత ఐదేళ్ళలో ఎన్ని కథలు చేసిందో జనానికి బాగా తెలుసని, వారు చేసే అరాచకాలు, అవినీతి తట్టుకోలేకే జగన్ కు 151 సీట్లు కట్టబెట్టారని, ఆ విషయం టీడీపీ నేతలు గుర్తుపెట్టుకుంటే మంచిదంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: