తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ కి రాజ్ పాకల (రాజేంద్ర ప్రసాద్) అనే బావమరిది ఉన్నారు. రాజకీయాల్లో పెద్దగా కనిపించని ఈ పెద్దమనిషి బడా పారిశ్రామిక వేత్తగా మంచి పేరు ఉంది. వ్యాపార వర్గాల్లో తరచుగా ఆయన పేరు వినిపిస్తూనే ఉంటుంది. ఇదిలా ఉంటే 20 కోట్లతో ఏర్పాటు అయిన ఒక సంస్థకు రాజ్ పాకాల డైరెక్టర్ కావడం ఆ తర్వాత 150 కోట్లు పెట్టుబడులు రావటం ఇప్పుడు పలు అనుమానాలకు తావిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో పేరొందిన ఫార్మా కంపెనీలు చాలానే ఉన్నాయి. కానీ వాటిని కాదని హైడ్రాక్సీ క్లోరోక్విన్ తయారీకి అవసరమైన ముడి సరుకును సప్లై చేసేందుకు వీలుగా కేటీఆర్ బావమరిది కంపెనీకి కేంద్రం ఒక డీల్ ను ఓకే చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.

 

కరోనా వైరస్ డ్రగ్ గా హైడ్రాక్సీ క్లోరోక్విన్ మెడిసిన్ ని తయారు చేయడానికి తెలంగాణ స్టేట్ లో మంచి పేరు ఉన్న బడా బడా ఫార్మా కంపెనీలు… కాదని మోడీ సర్కార్ ఈ చిన్న కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోవడం ఇప్పుడు ఒక ప్రశ్నగా మారింది. తెలంగాణ రాష్ట్రం నుండి టాక్స్ ఎక్కువగా కేంద్రానికి వెళ్లిన నిధులు విడుదల చేయడంలో కేంద్రం చాలా పక్షపాతంగా వ్యవహరిస్తుందని కేటీఆర్ అప్పట్లో ఆరోపణలు చేయడం జరిగింది.

 

ఇలా ఓ పక్క విమర్శలు చేస్తున్న గానీ మరో వైపు ఆయన బావమరిది కంపెనీకి కేంద్రం అవసరమైన డీల్ ఓకే చేయడం పట్ల ఆయనను ఇరికించడానికి బిజెపి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలంగాణ రాజకీయాల్లో వార్తలు వస్తున్నాయి. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి... కెసిఆర్ మరియు మోడీ సర్కార్ కలిసిపోయి బయటకు ఒకరితో ఒకరు పోరు అన్నట్టుగా యాక్ట్ చేస్తున్నారని విమర్శలు చేస్తున్నారు. కానీ లోలోపల మాత్రం డీల్ సెట్ చేసుకునే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని ఘాటు విమర్శలు చేయడం జరిగింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: