రైతులకు ఏపీ సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. ఈ ఏడాది ఖరీఫ్‌ నుంచి 80 శాతం ఫీడర్లలో వ్యవసాయానికి పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్‌ ఇవ్వనున్నట్టు ప్రకటించారు. గత ఖరీఫ్ లో ఏపీలో 58 శాతం ఫీడర్ల లోనే 9 గంటలు పగటి పూట ఇచ్చారు. ఈసారి దీన్ని 80 శాతానికి పైగా పెంచుతున్నట్లు సీఎం తెలిపారు. అంతే కాదు.. వచ్చే రబీ నాటికి మొత్తం అన్ని ఫీడర్లలోనూ వ్యవసాయానికి పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్‌ ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు.

 

 

విద్యుత్‌ రంగంపై నిర్వహించిన సమావేశంలో సీ ఎం వైయస్‌ జగన్‌ ఈ ప్రకటన చేశారు. తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశానికి ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్, జెన్ కో చైర్మన్ సాయిప్రసాద్, జెన్‌కో ఎండీ బి.శ్రీధర్, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజేయ కల్లం పాల్గొన్నారు. లాక్ డౌన్ వల్ల విద్యుత్ పంపిణీ లో ఇబ్బంది కలిగిందని అధికారులు వివరించారు. మిగిలిన 19 శాతం ఫీడర్లలో పనులు మందగించాయని తెలిపారు.

 

 

వచ్చే రబీ నాటికి పనులన్నింటినీ పూర్తి చేసి 100 శాతం ఫీడర్లలో పగటిపూట 9 గంటల పాటు ఉచిత కరెంటు ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు. దీంతో పాటు 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ప్లాంట్‌ ఏర్పాటుపైనా సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు కోసం ఇప్పటివరకూ తీసుకున్న చర్యలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మే నెలాఖరు నాటికి పనులు ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు తెలిపారు.

 

 

రైతులను ఆదుకునే విషయంలో ముందే ఉండాలన్నది సీఎం జగన్ పాలసీగా కనిపిస్తోంది. ఈ విషయంలో ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ చూసుకుంటే.. అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉచితంగా విద్యుత్ అందిస్తాని చెప్పి.. దాన్ని చేతల్లో చేసి చూపించారు. ఇప్పుడు అదే ఒరవడి కొనసాగించాలనుకుంటున్న జగన్ కూడా రైతులకు విద్యుత్ సరఫరా విషయంపై అధిక శ్రద్ధ తీసుకుంటున్నారనే చెప్పాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: