పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ సినిమాలో నాక్కొంచెం తిక్కుంది దానికో లెక్కుంది అన్న డైలాగ్ చాలా ఫేమస్. కాగా ప్రస్తుతం రాజకీయాల్లో కూడా పవన్ కళ్యాణ్ ఆ విధంగానే వ్యవహరిస్తున్నారు. అండగా నిలబడాల్సిన టైంలో నిలబడక అజ్ఞాతంలోకి వెళ్ళి పోతూ క్రియాశీలక రాజకీయ నేతగా పవన్ కళ్యాణ్ రాణించలేక పోతున్నారని చాలామంది అంటున్నారు. 2019 ఎన్నికల్లో మొట్టమొదటిసారి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోవడం జరిగింది. ఆ సమయంలో జనసేన పార్టీకి ఒక్క సీటు అదికూడా దళిత నాయకుడు గెలవడం జరిగింది. ఓటమి దెబ్బతో పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లోకి వెళ్ళిపోతారు అందరూ భావించిన... చివరి శ్వాస వరకు ప్రజా సమస్యలపై పోరాడతానని పవన్ కళ్యాణ్ అప్పట్లో స్పష్టం చేయడం జరిగింది.

 

 

ఇటువంటి సమయంలో కరోనా వైరస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలయతాండవం చేస్తున్న తరుణంలో...ప్రజల తరఫున పోరాడకుండా పవన్ కళ్యాణ్ అజ్ఞాతంలో ఉండటం పట్ల సొంత పార్టీ నాయకులు కూడా ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఇదే సమయంలో మరోపక్క పవన్ కళ్యాణ్ వరసగా సినిమాలు ఒప్పుకోవడం పట్ల కూడా విమర్శలు వస్తున్నాయి. పార్టీ కేడర్ కి మరియు జనసేన పార్టీ నాయకులకు అందుబాటులో లేక గత కొన్ని నెలల నుండి సినిమా రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు పార్టీలో ఇన్సైడ్ టాక్ వినపడుతోంది.

 

 

కాగా నిలబడాల్సిన టైములో పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ నిలబడకుండా అజ్ఞాతంలోకి వెళ్లి పార్టీని తనకు తానే కూల్చికునే అవకాశమున్నట్లు వార్తలు వినబడుతున్నాయి. ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన సమయంలో ప్రతిపక్ష పాత్ర పవన్ కళ్యాణ్ ఈ టైంలో సరిగ్గా పోషిస్తూ ఉంటే, అదే పార్టీకి చాలా బెనిఫిట్ అని చాలామంది అంటున్నారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: