కరోనా మహమ్మారి వ్యాప్తి చెందకుండా నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం మరొక రెండు వారాలు పొడిగిస్తున్నట్లు శుక్రవారం తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఈసారి పొడిగింపు లో చాలా ప్రాంతాలకు ఎన్నో నిబంధనలను తొలగించారు. కరోనా కేసుల సంఖ్యాపరంగా ప్రతి రాష్ట్రంలోని జిల్లాలను రెడ్, గ్రీన్ మరియు ఆరెంజ్ జోన్ లు గా విభజించిన విషయం తెలిసిందే.

 

గ్రీన్ మరియు ఆరెంజ్ జోన్ లలో ఉన్న ప్రాంతాలకు అన్నీ సడలింపు వర్తిస్తాయి. వీటిలో భాగంగా మందుబాబులు కి మినిస్ట్రీ ఆఫ్ హోం ఎఫైర్స్ తీయటి కబురు చెప్పింది. మే 4 తేదీ నుండి మందు, పాన్ మరియు పొగాకు విక్రయాలు చేసుకునేందుకు కేంద్రం అనుమతి ఇవ్వగా ఎక్కువగా కేసులు నమోదైన ప్రాంతంలో మరియు మాల్స్ ఇంకా మార్కెట్ కాంప్లెక్స్ లలో వాటి విక్రయాలు జరగకూడదు అని కూడా ఆదేశించింది.

 

అయితే రెడ్ జోన్ లో నివసిస్తున్న వారికి అవకాశం లేదని ముందు చెప్పినా కూడా తర్వాత రెడ్ లలో ఆయా రాష్ట్ర ప్రభుత్వం మందు విక్రయానికి అనుమతి ఇచ్చినట్లయితే.... మద్యం షాపు జనావాసానికి దూరంగా.... అనగా ఊరి బయట లేదా ప్రజలు ఎవరూ లేని ప్రాంతంలో ఉన్నది అయి ఉండాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇకపోతే జోన్ లో అయినా కూడా మనిషికి-మనిషికి మధ్య ఆరు అడుగుల దూరం ఉండాలని మరియు ఒక షాపు ముందు ఐదు కన్నా ఎక్కువ ఉండకూడదు అని కూడా హెచ్చరించింది.

 

దెబ్బతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని మందు బాబులకి ఎక్కడ లేని హుషారు వచ్చింది. ఇన్ని రోజులు చుక్క వాసన ఎరుగక…. మందు రుచి చేయక ఉన్న వారంతా ఇప్పుడు ఎప్పుడెప్పుడు మద్యం దుకాణాలు తీస్తారా అని వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: