కరోనా భయంతో ప్రపంచమంతా వణికిపోతున్న వేళ.. ఇప్పుడు ఓ వార్త కాస్త ఊరట కలిగిస్తోంది. కరోనా భయం నుంచి కాస్త ఉపశమనం కలిగిస్తోంది. కరోనా అంటేనే అదో మృత్యుదేవత అన్నట్టుగా పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఈ వార్త జనాల్లో కాస్త ఆత్మ విశ్వాసం నింపే అవకాశం ఉంది. అదేంటంటే.. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకూ కరోనా వచ్చి కోలుకున్న వారి సంఖ్య ఏకంగా పది లక్షలు దాటింది.

 

 

కోవిడ్‌-19 బారిన పడి కోలుకున్న వారి సంఖ్య మిలియన్‌ మార్క్‌ దాటింది. తాజా గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా దాదాపు పది లక్షల 80 వేల మందికిపైగా కరోనా వచ్చినా దాన్ని జయంచి కోలుకున్నారు. ఇక మరిన్ని లెక్కలు చూస్తే.. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 34 లక్షల మందికి పైగా కరోనా వైరస్‌ బారిన పడ్డారు. ఈ కోవిడ్‌-19 సోకిన వారిలో 2 లక్షల 39 వేల మంది ఇప్పటి వరకు మృత్యువాత పడ్డారు.

 

 

రెండు లక్షల మందికిపైగా కరోనా తో చనిపోవడం చిన్న విషయం కాకపోయనా.. వైరస్‌ను తట్టుకునే శక్తి మనుషుల్లో రోజు రోజుకు పెరుగుతోందట. అందుకే మరణాల రేటు కాస్త తగ్గుముఖం పట్టిందంటున్నారు నిపుణులు. కరోనాపై సాగించే సమరంలో ఇది సానకూల పరిణామమే. ఇక ప్రపంచ దేశాలతో పోలిస్తే ఇండియా పరిస్థితి ఇంకా మెరుగ్గా ఉంది. ఈ విషయాలను కేంద్ర ఆరోగ్య శాఖ చెబుతోంది.

 

 

కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం.. కరోనా బారిన పడి కోలుకుంటున్నవారి సగటు గురువారం నాటికి 25.19 శాతంగా ఉందట. అంతే కాదు.. కరోనా కారణంగా మరణిస్తున్నవారి సంఖ్య కేవలం 3.2 శాతం మాత్రమేనట. అంటే వంద మందికి కరోనా సోకితే.. మరణించే వారి సంఖ్య కేవలం ముగ్గురు మాత్రమే అన్నమాట. ఈ లోపు కరోనాకు వ్యాక్సీన్ కనిపెడితే ఈ మహమ్మారి కట్టడి మరింత సులభమవుతోంది. సో.. కరోనా గురించి మరీ అంతగా బెంబేలెత్తాల్సిన అవసరం లేదన్నమాట.

 

మరింత సమాచారం తెలుసుకోండి: