ప్రపంచాన్ని  మొత్తం చిగురుటాకులా వణికిస్తూ  ప్రస్తుతం ప్రజలందరినీ ప్రాణభయంతో బ్రతికేలా చేస్తున్నది ప్రపంచ మహమ్మారి కరోనా వైరస్. చైనాలో వెలుగులోకి వచ్చిన ఈ మహమ్మారి వైరస్ ప్రస్తుతం దాదాపుగా 200 దేశాలకు పైగా వ్యాప్తి చెందింది. ఇక ఈ మహమ్మారి వైరస్ ను అంతం చేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది మహా మహా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. కానీ ఎక్కడ విరుగుడు మాత్రం కనుగొనలేకపోయారు. దీంతో ఈ మహమ్మారి వైరస్ కు నివారణ ఒక్కటే మార్గం అని చెప్పడంతో... ప్రజలందరూ మరింత అతి జాగ్రత్తగా ఉంటున్నారు. దాదాపుగా అన్ని దేశాలు నిర్బంధంలోకి వెళ్లిపోవడంతో... అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు సంక్షోభంలో కూరుకు పోతున్నాయి. దేశంలోని అన్ని రంగాల్లో తీవ్ర నష్టం వాటిల్లుతుంది. 

 

 

 అయితే ఈ మహమ్మారి వైరస్ వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పరిశోధనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఓ వైపు ఈ వైరస్ కు విరుగుడు కనిపెట్టేందుకు పరిశోధనలు జరుగుతుంటే మరోవైపు... ఈ మహమ్మారి వైరస్ మూలాలను తెలుసుకోవడంతో పాటు మరిన్ని వివరాలు సేకరించాలని పరిశోధనలు  జరుగుతున్నాయి. ఇలా ఈ  ప్రపంచ మహమ్మారి అయినా కరోనా  వైరస్ గురించి జరుగుతున్న పరిశోధనలలో రోజుకొక కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. 

 

 

 తాజాగా యూఎస్ఏ నిపుణులు చేసిన ఓ అధ్యయనంలో కరోనా  వైరస్ కు సంబంధించి సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ప్రపంచ మహామారి అయిన కరోనా  వైరస్ ప్రభావం ప్రపంచ దేశాలపై రెండేళ్ల వరకు ఉంటుంది అని అమెరికాలోని శాస్త్రవేత్తల బృందం తెలిపింది. వేసవికాలంలో ఎండలు మండుతున్న సమయంలోనే వైరస్  కంట్రోల్  కావడం లేదని ఇక రాబోయే శీతాకాలంలో అయితే ఈ వైరస్ ప్రభావం మరింత   ఎక్కువగా ఉంటుంది అంటూ పరిశోధకులు చెబుతున్నారు. మిన్నెసోట వర్సిటీకి చెందిన సెంటర్ ఫర్ ఇన్ఫెక్షన్ డిసీస్ రీసెర్చ్ అండ్ పాలసీ పరిశోధకుల బృందం ఓ నివేదికలో ఈ విషయాన్నీ  వెల్లడించింది. ప్రజల్లో రోజురోజుకీ రోగనిరోధక శక్తి తగ్గుతుంది అంటూ తెలిపిన పరిశోధకులు ఒకవేళ వ్యాధి ప్రభావం తగ్గినప్పటికీ సీజనల్ కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంది అంటూ  చెప్పుకొచ్చారు శాస్త్రవేత్తల బృందం.

మరింత సమాచారం తెలుసుకోండి: