సంపాదించుకోవాలనుకునే వాడికి సంపాదించుకున్నంతా.. అర్ధం కాలేదా.. కరోనా వచ్చి పేదలను మరీ నిరూపేదలను చేస్తుంటే ధనవంతులకు మాత్రం సంపాదన ద్వారాలు తెరస్తుంది.. అవును ఇప్పుడు బ్లాక్ మార్కెట్ చేస్తున్న వాడు కరోనా తగ్గేలోపల అనుకున్నంత ధనాన్ని కూడబెట్టవచ్చు.. అంటే ఒకరకంగా అవినీతి లాంటిది.. సిగ్గుఎగ్గు, నీతి మానం లేని కొందరు వ్యాపారులు ఈ సమయాన్ని పూర్తిగా సంపాదన మీదికి మళ్లిస్తున్నారు.. వ్యభిచారం చేసే మహిళను వ్యభిచారిణి అంటారు.. మరి ఇలా అడ్దదార్లో దోచుకునే వారిని ఏమనాలో పాఠకుల్లారా మీరే నిర్ణయించండి..

 

 

ఆశకు అంతుండాలి.. కాని అది దురాశగా మారితే తెలియకుండానే పతనాన్ని ఆహ్వానిస్తున్నట్లే.. ఒక పేదవాడి ఉసురు ఊరికే పోదు.. ఎన్నో పాపాలు చేస్తే కరోనా అనే విపత్తు పుట్టింది.. ఇప్పటికైనా మనిషి దీన్ని గుణపాఠంగా భావించకుండా పశువుకంటే హీనంగా బ్రతికితే కనీసం సంపాదించుకున్న సొమ్ము కూడా చచ్చాక ఉపయోగపడదు.. ఇకపోతే అక్రమార్జనకు దళారులు తెరతీసారు.. అదేమంటే రాష్ట్ర సర్కారు ఇటీవల గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ పనులు చేసుకోవచ్చని కలెక్టర్లకు మౌఖిక ఆదేశాలిచ్చిన నేపధ్యంలో ఇటుక బట్టీలు, బ్రిక్స్, సిమెంట్, స్టీలు పరిశ్రమలు తెరుచుకోవచ్చని గురువారం కొన్ని జిల్లాల్లో ఆఫీసర్లు పత్రికా ప్రకటనలు కూడా జారీ చేశారు.

 

 

ఈ క్రమంలో గతంలో వ్యాపారులు హోల్‌‌‌‌‌‌‌‌సేల్‌‌‌‌ ‌‌‌‌ధరలపై సిమెంట్ ‌‌‌‌‌‌‌‌బస్తాలను తీసుకొచ్చి రూ.5, రూ.10 లాభంపై అమ్మేవారు. కానీ లాక్‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌ ప్రారంభం కాగానే వ్యాపారులంతా తమ వద్ద ఉన్న సిమెంట్‌‌‌‌‌‌‌‌ బస్తాలను బ్లాక్‌‌‌‌‌‌‌‌చేశారు. అప్పటి నుంచి అవసరమైన వారికి ఎంఆర్‌‌‌‌‌‌‌‌పీ రేటుకంటే రూ. వంద నుంచి రూ.200 కు పైగా పెంచి అమ్ముతున్నారు.

 

 

ఇదిలా ఉండగా కరీంనగర్ లాంటి జిల్లాల్లో లాక్​డౌన్​కు ముందు ఓ కంపెనీకి చెందిన సిమెంట్ ఒక్కో బస్తాను రూ.300కు అమ్మగా, తాజాగా రూ.500 తీసుకుంటున్నారట. ఇక రూ.46 వేల వరకు ఉన్న టన్ను స్టీలు రూ.52 వేలకు అమ్ముతున్నారు. ప్రముఖ కంపెనీలకు చెందిన సిమెంట్ బస్తాలనైతే బ్లాక్ మార్కెట్​కు తరలించి, దొరకకుండా చేశారు. మరి ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకుంటే గానీ ఈ అవినీతి ఆగదు.. ఇలాగే వదిలేస్తే కరోనాలాగా ఈ బ్లాక్ మార్కెట్ అన్ని వ్యాపార సంస్దలకు విస్తరిస్తుంది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: