ఒకవైపు కరోనా మహమ్మారితో ప్రజలు అతలాకుతలం అవుతుంటే... మరోవైపు హత్యలు, ఆత్మహత్యలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ప్రియుడి కోసం ఏర్పాటు చేసిన బర్త్‌ డే పార్టీకి రాలేదన్న కోపంతో కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈ సంఘటన చెన్నై నగరంలో చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళితే... పోలీసులు తెలిపిన సమాచారం మేరకు విల్లుపురానికి  చెందిన శివ కుమార్తె శరణ్య రైల్వే కానిస్టేబుల్ గా పనిచేస్తూ పెరంబూరు రైల్వే క్వార్టర్స్ లో జీవనం కొనసాగిస్తుంది. ప్రస్తుతం కరోనా భద్రత కోసం ఎస్ పల్లేరు పోలీస్ స్టేషన్ లో ఆమెకు విధులు కేటాయించడం జరిగింది. 

 

ఇక అదే పోలీస్ స్టేషన్ లో సాయుధ బలగాల విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఏలుమలై తో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారడం జరిగింది. ఈ తరుణంలో గురువారం ఏలుమలై బర్త్‌ డే అవ్వడంతో శరణ్య... విధులు త్వరగా పూర్తిచేసుకుని ప్రియుడు బర్త్‌ డే వేడుకల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. అలాగే 6 గంటల సమయానికి క్వార్టర్స్ కు రావాలని ఏలుమలై కు తెలియజేసింది. 

 

ఇది ఇలా ఉండగా ఏలుమలై పేదలకు ఆహారం అందించే ప్రాంతాలలో పోలీస్ అధికారులు భద్రత నిధులు కేటాయించడం జరిగింది. దీనితో శరణ్య చెప్పిన టయానికి వెళ్లకపోవడంతో.. ఇందుకు గల కారణం వివరించడానికి రాత్రి 9 గంటల వరకు తనకు ఫోన్ చేశాడు.. కానీ ఆమె స్పందించలేదు, ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా ఫోన్ తీయక పోవడంతో.. అదే క్వార్టర్స్ లో నివసిస్తున్న ఆమె మిత్రురాలు రాజేశ్వరికి ఫోన్ చేశాడు.. రాజేశ్వరి తొమ్మిదిన్నర గంటల సమయంలో వెళ్లి చూడగా శరణ్య అప్పటికే ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీనితో రాజేశ్వరి పోలీస్ అధికారులకు సమాచారం ఇవ్వడం జరిగింది. ఇక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం చేయడానికి ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: