నేడు ఉదయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా హెల్త్ బులిటెన్ ను విడుదల చేసింది. అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం కరోనా కేసులు తగ్గడం లేదు. ప్రతిరోజు రాష్ట్రంలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇక పోతే గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 62 కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులతో రాష్ట్రంలో ఏకంగా మొత్తం కేసులు సంఖ్య 1525 కు చేరింది. ఇక ఇప్పటివరకు ఈ వ్యాధి బారిన పడి రాష్ట్రంలో 33 మంది చనిపోయారు. అలాగే నేటి ఉదయానికి 62 కేసులు కొత్తగా నమోదయ్యాయని అధికారులు చెబుతన్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో 1051 యాక్టివ్ కేసులు చికిత్స పొందుతున్నారు. ఇకపోతే 441 మంది బాధితులు ఈ వైరస్ నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యి ఇంటికి చేరుకున్నారు.


ఇక అసలు విషయానికి వస్తే ... మరోసారి కర్నూలు జిల్లాలోనే కొత్తగా నమోదైన కేసుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. నేడు మరో 25 కేసులు నమోదు కాగా కర్నూలు జిల్లాలో కేసుల సంఖ్య 436 కు చేరుకుంది. అంతేకాకుండా గుంటూరు జిల్లాలో 300 మార్క్ దాటింది. ఇక నేడు కొత్త వివరాలు జిల్లా వారీగా చూస్తే ... అనంతపురంలో 4, చిత్తూరులో 0, ఈస్ట్ గోదావరిలో 3, గుంటూరులో2, కడప 4, కృష్ణ 12, కర్నూలులో 25, నెల్లూరు 6, ప్రకాశం 1, శ్రీకాకుళం 0, విశాఖపట్నంలో 4, విజయనగరంలో 0, పశ్చిమగోదావరిలో 1 కొత్త కేసులు వచ్చాయి.

 

అయితే ఇక జిల్లాల వారిగా ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య ఒకసారి చుస్తే అత్యధికంగా కర్నూలు జిల్లా -436, గుంటూరు జిల్లా - 308, కృష్ణా జిల్లా - 258 , నెల్లూరు జిల్లా -90, చిత్తూరు జిల్లా - 80, కడప జిల్లా -83, ప్రకాశం జిల్లా - 61, పశ్చిమ గోదావరి జిల్లా - 59, అనంతపురం జిల్లా -71, తూర్పుగోదావరి జిల్లా - 45, విశాఖపట్నం జిల్లా -29, శ్రీకాకుళం జిల్లా - 5 ఇక మొత్తం కేసులు -1525.

 

అయితే కర్నూలు జిల్లాలో అధికారులు లాక్ డౌన్ విధానంలో కఠిన చర్యలు తీసుకుంటున్న కానీ అక్కడ మాత్రం కేసుల సంఖ్య మాత్రం రోజురోజుకు పెరుగుతుంది. ఇంతకీ అక్కడ ఎం జరుగుతుందో అర్థం కాకా అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: