వెధవలు పలు రకాలు ... నిజంగా వారు చేసి పనులను చూస్తే ఇంకా అనాలని అనిపిస్తుంది. అసలు ఎం జరిగిందన్న విషయానికి వస్తే... అనంతపురంలో ఒక విచిత్రం జరిగింది. గత 15 రోజుల నుండి ఇంట్లోనే ఉంటున్న బైక్‌కు అనంతపురం ట్రాఫిక్ పోలీసులు చలానా వేశారనే ఆరోపణలు వచ్చాయి. అయితే నిజానికి అక్కడ ఏం జరిగిందని ఆరా తీసిన పోలీసులకు దిమ్మ తిరిగే షాక్ ఒకటి తగిలింది. అనంతపురం పట్టంలో మూడో రోడ్డులో నివసిస్తున్న ఒక డాక్టర్ ‌కు కరోనా పాజిటివ్ రావడంతో 16 రోజుల కిందట రెడ్ ‌జోన్ ‌గా ఏరియాగా ప్రకటించారు. ఇక దీనితో ఆ కాలనీ వాసులు మొత్తం ఇళ్లకే పరిమితమయ్యారు అని చెప్పవచ్చు. అంతేకాదు వారెవ్వరు రోడ్లపైకి కూడా రాలేదు.

 


అయితే అదే రోడ్డులో నివాసం ఉంటున్న ఒక ప్రముఖ కాలేజీలో లెక్చరర్ గా పనిచేసే ద్వారకానాథ్‌ హోండా షైన్‌ ap 02 AW 9805 నెంబర్ గల బైక్ కు జరిమానా పడినట్లు మొబైల్ ‌‌కు 'ఈ-చలానా' వచ్చింది. అయితే, అదేంటి బైక్ అసలు బయటకు తీయకుండానే ఈ చలానా ఎలా వచ్చిందని లెక్చరర్ షాక్ తిన్నారు. ఇక ఆ వెంటనే ఈ - చలానా యావ్ ‌ను డౌన్ ‌లోడ్‌ చేసుకొని, తన వాహన నంబర్‌ పై ఏవైనా చలానాలు ఉన్నాయా అని చెక్ చేసి చూసుకున్నారు.

 

ఇక అంతే... అసలు విషయం ఏమిటంటే ట్రాఫిక్ పోలీసుల యాప్ ‌లో జరిమానాకు విధించిన వివరాలతో పాటు మరో స్కూటీ కనిపించింది. దీనితో ఆశ్చర్యపోయిన ఆయన తన వాహన నెంబరును స్కూటీ పై మరొకరు వేసుకొని తిరుగుతున్నట్లు గమనించడంతో ఆయను మైండ్ బ్లాక్ అయింది. ఇంకేముంది వెంటనే మూడో పట్టణ ఎస్సైకు ఫిర్యాదు అందచేశారు. దీనితో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆ అదే నెంబర్ ఉన్న ఫోటో ఆధారంగా బైక్ ను వెతకడం మొదలు పెట్టారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: