శృంగారం ముందు ఈ ప‌నులు చేయ‌కూడ‌దు అని ఎక్క‌డా ఉండ‌దు. ఎందుకంటే ఒక్కో మ‌నిషి ఒక్కోలా ఆలోచిస్తూ ఉంటాడు. ఒకొక్క‌రికి ఒక్కో ఇష్టం క‌లిగి ఉంటుంది. ఉదాహారణకి, కొంతమంది శృంగారానికి ముందు భోజనం చేయడానికి ఇష్టపడరు, మరికొంతమందికి అలా పొట్ట నిండిన ఫీలింగ్ చాలా ఇష్టముండొచ్చు. అందుకనే, మీకు హాయిగా అనిపించే వాటిని అనుసరించడం మంచిది. అయిన‌ప్ప‌టికీ కొన్ని చెడ్డ అల‌వాట్ల వ‌ల్ల చాలామంది ఇష్ట‌ప‌డ‌డం లేదు. కూడా కొన్ని చెడ్డ అలవాట్లు, కుంగదీసే ఆలోచనలు వంటి వాటిని మీ పడకగదిలోకి తీసుకెళ్ళకుండా ఉండడం మంచిది. ఏమేం చేయకుండా ఉంటే మంచిదో ఒకసారి చూసేయండి.

 

చాలా మంది కాళ్ళ‌పైన వెంట్రుక‌ల్ని అలాగే బికినీ ఏరియానిగానీ షేవ్ చేసుకుంటే మంచిద‌ని భావిస్తారు. కాని అది చాలా వ‌ర‌కు నిజం కాదు. ఇక అలా చేయాల‌నుకున్న‌ప్పుడు ఒక‌రోజు ముందే చేయాలంటున్నారు. మీ వస్త్రాలు ఒక్కొక్కటిగా జారి పడిపోతున్నప్పుడు. మీలోని లోపాల గురించి ఆలోచించకుండా ఉండటం కష్టం. కానీ, మీ లోపాల కంటే కూడా, నేను పరిపూర్ణంగా లేనేమో అన్న ఆలొచనలు మ‌న‌సు రానివ్వ‌కూడ‌దు. దాని వ‌ల్ల  ఎక్కువ నష్టం క‌లుగుతుంది. 

 

ఇక ఈ విష‌యాన్ని జాగ్ర‌త్త‌గా గ‌మ‌నించండి. విచిత్రంగానే ఉంటుంది గానీ విషయం తెలిశాక నిజమే కదా అనిపిస్తుంది. విమెన్స్ హెల్త్ లో కిస్సీ బ్రేడీ చెప్పినట్టుగా ఎలెక్ట్రానిక్ టూత్ బ్రష్ వలన సుఖవ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందట. అవి కళ్ళకి కనబడినంత చిన్న రంధ్రాలు చేస్తాయి అవి మ‌న‌కు తెలియ‌కుండా మ‌న  చిగుళ్ళ మీద తీవ్ర ప్ర‌భావం చూపిస్తాయ‌ని  డెర్మటాలజిస్ట్ సపోరా షైన్ హౌస్ ఆమెతో అన్నారట.

 

ఇక చాలా మంది పడకగదిలోకి వెళ్ళిన తరువాత నిరుత్సాహంగా అనిపించే విషయాలేవీ మాట్లాడకండి. ఇందులో రోజువారీ చిరాకులూ, కట్టాల్సిన లోన్లూ అన్నీ వస్తాయి. "వీటి గురించి మాట్లాడడం మొదలు పెడితే మీ శృంగార సమయం మొదలుపెట్టకుండానే ముగిసిపోతుంది", అంటారు రిలేషన్‌షిప్ ఎక్స్‌ప‌ర్ట్‌ ఆడీ హోప్. సరదా సంభాషణని మించింది లేదు ఈ సమయంలో అని గుర్తుపెట్టుకోండి.

 

అందరికీ లూబ్రికెంట్ అవసరం ఉండకపోవచ్చు. కానీ, దగ్గర్లో ఉంచుకుంటే నష్టమేమీ లేదు కదా. "లూబ్రికెంట్ వాడడం వలన రాపిడి తక్కువగా ఉండి శృంగారం ఇంకా ఆనందకరంగా మారుతుంది. కొంత మంది ఇంట్ర‌స్ట్ లేక‌పోయినా త‌ప్ప‌క సెక్స్‌లో పాల్గొంటారు. అలాంట‌ప్పుడు శృంగారం క‌ష్ట‌త‌ర‌మ‌వుతుంది. ఆ స‌మ‌యంలోనే చాలా మంది లూబ్రికెంట్లును వాడ‌తారు. పైగా మంట లాంటిది లేకుండా ఉంటుంది" అంటారు మై సీక్రెట్ షోయరీ ఫౌండర్ ఎండ్ సీయీవో స్టేసీ రిబ్చిన్. కాబట్టి మీకు అందుబాటులో ఒక బాటిల్ పెట్టుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: