ఇది నిజంగా ఆశ్చర్యమే. చైనా తనదైన నియంత పాలన కొనసాగిస్తోంది. అన్ని దేశాలకు పెద్దన్నగా ఉండే అమెరికా మాటనే భేఖాత‌ర్ చేస్తుంది. ఏనాటికైనా తానే ప్రపంచానికి పెద్దన్న కావాలన్న‌ది చైనా బలమైన కోరిక. ఇపుడు కరోనా వైరస్ కూడా చైనా ప్రయోగం అని అమెరికా అనుమానిచడానికి అదే కారణం.

 

బయోవార్ కి తెరతీయాలని చైనా చూస్తోందని అమెరికా పెద్దన్న పెద్ద డౌట్ పడుతున్నాడు. ఇవన్నీ ఇలా ఉంటే చైనాని తెల్లారి లేస్తే అమెరికా బెదరగొడుతోంది. నీ గుట్టు బయటకు  తీస్తాం, నీ  అంతు చూస్తామంటూ ట్రంప్ అదే పనిగా హెచ్చరిస్తున్నాడు. ఈ అంతూ పొంతూ చూడడం పక్కన పెడితే ఇపుడు చైనా అధినేత జిన్ పింగ్ కి కొత్త భయం పట్టుకుందిట.

 

అదేమంటే ఆయన ఒక్కగానొక్క కూతురు అమెరికాలోనే చదువుకుంటోందిట. ఆమె పేరు మార్చుకుని అక్కడే ఉంటోందిట. ఇదంతా కరోనా వైరస్ రాకముందు, చైనా మీద అమెరికా కారాలూ మిరియాలూ నూరకముందూ జరిగిన ముచ్చట. ఇపుడు అదే జిన్ పింగ్ భయంగా ఉందిట. తన మీద విరుచుకుపడుతున్న అమెరికాకు ఈ లోగుట్టు తెలిస్తే  ట్రంప్ బ్లాక్  మెయిల్ చేస్తాడేమోనని  జిన్ పింగ్ తెగ  కలవరపడుతున్నాడుట.

 

దాంతో జిన్ పింగ్ నిద్ర లేని రాత్రులు గడుపుతున్నాడుట. మరో వైపు అమెరికాలో కరోనా మరణాలు కూడా జిన్ పింగ్ భయానికి ఇంకో కారణమట. ఇవన్నీ చూసినపుడు ప్రపంచంలో అన్ని విషయాలు చిటికలో తెలుసుకున్న అమెరికాకు చైనా అధినేత ముద్దుల కూతురు వ్యవహారం తెలియకుండా ఉంటుందా అన్నది ఒక చర్చగా ఉంది. మొత్తానికి జిన్ పింగ్ బెంగ పడుతూంటే ఈ రక్తబంధాన్ని ఆసరాగా చేసుకుని ట్రంప్ కొత్త స్కెచ్ గీస్తాడా అన్న డౌట్లు పుడుతున్నాయి.  చూడాలి మరి. ఈ భయాలు కలవరాలూ ఎలా రూపుమార్చుకుంటాయో. ఏ రకమైన వ్యూహాలకు తెర తీస్తాయో.

 

మరింత సమాచారం తెలుసుకోండి: