ఏపీలో కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తోంది. ఇక్క‌డ క‌రోనాను కట్ట‌డి చేసేందుకు వైసీపీ ప్ర‌భుత్వం ఎన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నా క‌రోనా మాత్రం ఆగ‌డం లేదు. ఇక ఇప్ప‌టికే జ‌గ‌న్ ప్ర‌భుత్వం రికార్డు స్థాయిలో ల‌క్ష‌కు పైగా క‌రోనా ప‌రీక్ష‌లు చేసింది. ఇక గ‌త 24 గంటల్లో 5943 శాంపిల్స్‌ టెస్ట్‌ చేయగా..62 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన ట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. ఇక ఈ కొత్త 62 కేసుల‌తో క‌లుపుకుంటే ఏపీలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా సోకిన వారి సంఖ్య 1525కు చేరుకుంది. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు ఇక్క‌డ కోలుకున్న వారు 441 గా ఉన్నారు.

 

ఇక ఈ వైర‌స్ భారీన ప‌డి ఇప్ప‌టి వ‌ర‌కు 33 మంది మృతి చెందారు. వీరిలో ఎక్కువ మంది వృద్దులే ఉన్నారు. ఇక ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 1051 మంది కరోనా బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.  కొత్తగా కర్నూలు(25), కృష్ణా(12)  జిల్లాల్లో  ఎక్కువగా కేసులు నమోదయ్యాయి. ఏపీలో ప్ర‌భుత్వం ఎన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నా క‌రోనాకు క‌ట్ట‌డి లేక‌పోవ‌డం వెన‌క క‌ర్నూలు, గుంటూరు, విజ‌య‌వాడ‌, వైజాగ్ లాంటి చోట్ల ప్ర‌జ‌ల నిర్ల‌క్ష్య‌మే కార‌ణంగా తెలుస్తోంది. ఢిల్లీ వెళ్లిన వారు క‌రోనా ల‌క్ష‌ణాలు ఉన్న వారు ఇళ్ల‌ల్లోనే స్నేహితులు, బంధువుల ఇళ్ల‌కు వెళ్ల‌డం.. సోష‌ల్ డిస్టెన్స్ పాటించ‌క‌పోవ‌డం.... లాంటి ర‌క‌ర‌కాల కార‌ణాల ద్వారా అనేక మందికి ఈ వైర‌స్ వ్యాప్తి చెందుతోంది. 

 

ఇక జ‌గ‌న్ సైతం రెడ్ జోన్ల విష‌యంలో మ‌రింత క‌ఠినంగా ఉండేలా కార్యాచ‌ర‌ణ‌కు రెడీ అవుతున్నారు. గ్రీన్ జోన్‌లో ఆంక్ష‌లు ప‌రిమితం చేసి రెడ్ జోన్ల‌తో పాటు ఎక్క‌డ అయితే క‌రోనా కేసుల తీవ్రత ఎక్కువుగా ఉంటుందో ?  ప్ర‌జ‌లు నియంత్ర‌ణ త‌ప్పుతున్నారో ? అక్క‌డ క‌ఠిన‌మైన నిబంధ‌న‌ల‌తోనే క‌రోనాకు అడ్డుక‌ట్ట వేయాల‌ని నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: