ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి మన దేశంలో కూడా రోజు రోజుకీ దాని ప్రతాపాన్ని చూపిస్తుంది.  ఈ నేపథ్యంలో మార్చి 24 తర్వాత దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు.  లాక్ డౌన్ కారణంగా ఎలాంటి పరిస్థితుల్లోనూ బయటకు రావడానికి వీలు లేదని చెప్పారు. దాంతో దినసరి కూలీలు, చిరు వ్యాపారల పరిస్థితి దుర్భరంగా మారిపోయింది.  తాజాగా సోమవారం ప్రధాన్ మంత్రి జన్ ధన యోజన ఖాతాల్లో రెండో విడత మరో రూ.500 డిపాజిట్ కానున్నాయి. మార్చి 26న  కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతా రామన్ చెప్పిన వివరాల ప్రకారం  కరోనా వైరస్ నుంచి పేదల్ని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీని ఏర్పాటు చేసింది.

 

మొన్నటి వరకు వివిధ ప్రదేశాల్లోచిక్కుకున్న వలస కూలీలు ఇప్పుడ  స్వస్థలాలకు వెళ్లేందుకు కేంద్రం అంగీకరించింది...ఇందుకు సంబంధించిన ఆదేశాలు కూడా జారీ చేసింది.  ఈ నేపథ్యంలో వలస కూలీలు తమ స్వస్థలం చేరుకుంటున్నారు.ఈ నేపథ్యంలో ఏప్రిల్ నెల ప్రారంభం నుంచి మూడు నెలలు పాటు ప్రతీ నెల రూ.500 బ్యాంక్ అకౌంట్లలో డిపాజిట్ చేయనుంది. అందుకు అనుగుణంగా సోమవారం మహిళా జన ధన్ బ్యాంక్ ఖాతాదారులకు రెండవ విడత రూ.500 జమ చేయనున్నట్లు కేంద్ర ఆర్ధిక శాఖ అధికారులు తెలిపారు.

 

కరోనా వైరస్ కారణంగా కుటుంబంలో ఉన్న అకౌంట్ల ఆధారంగా డబ్బుల్ని డిపాజిట్ చేయనున్నట్లు బ్యాంకింగ్‌ వ్యవహారాల శాఖ కార్యదర్శి దేబాశిష్‌ పాండా సోషల్ మాద్యంలో పోస్ట్ చేశారు. తల వారీ బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు జమప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన పథకం కింద కుటుంబంలో ఒక మహిళకు ఒక్క అకౌంట్ ఉంటే మే 4న, ఇద్దరు లేదా ముగ్గురు మహిళలకు అకౌంట్లు ఉంటే మే 5న,  4లేదా 5అకౌంట్లు ఉంటే మే 6న,  6లేదా 7 అకౌంట్లు ఉంటే మే 8న, 8లేదా 9 అకౌంట్లు ఉంటే మే 11న బ్యాంక్ అకౌంట్ల నుంచి డబ్బుల్ని డ్రా చేసుకోవచ్చని తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: