కరోనా వైరస్ వల్ల అమెరికా చైనా దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతోంది. చైనాపై కోపంతో అమెరికా, యూరోపియన్ దేశాలు, జపాన్, మరికొన్ని దేశాలు డ్రాగన్ దేశంలో ఉన్న కంపెనీలను వెనక్కు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఈ దేశాలకు షాక్ ఇవ్వడానికి చైనా ఒక ఎత్తుగడ వేస్తోంది. అమెరికాను ఇరకాటంలో పెట్టి ఇతర దేశాలను ఆధీనంలోకి తెచ్చుకోవాలని చైనా భావిస్తోంది. 
 
అమెరికాకు సంబంధించిన అతిపెద్ద రిటైల్ మార్కెట్ చైనా కావడంతో డ్రాగన్ దేశం తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరుస్తూ చైనా స్టాక్ ఎక్చేంజ్ లో డాలర్ ను రద్దు చేసి డ్రాగన్ దేశం కరెన్సీ యునాన్ కు అధికారికంగా తీసుకురావాలని నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. చైనా వాణిజ్యంలో డాలర్ ను ఉనికిలో లేకుండా చేయడం ద్వారా చైనా కరెన్సీని బలోపేతం చేయాలని ఆ దేశ ప్రభుత్వం భావిస్తోంది. 
 
చైనా తాజాగా ప్రత్యేక డిజిటల్ కరెన్సీని సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ.ఆర్.ఎం.బీ పేరుతో తీసుకురాబోతున్న ఈ కరెన్సీని ప్రధాన ఆర్థిక వ్యవస్థచే నిర్వహించబడుతున్న మొట్టమొదటి డిజిటల్ కరెన్సీగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. చైనా డాలర్ విలువను తగ్గించటానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోందని సమాచారం. డాలర్ విలువ కంటే యునాన్ విలువ పెరిగితే అమెరికాతో పాటు ఇతర దేశాలను తమ ఆధీనంలోకి తెచ్చుకోవచ్చని అమెరికా భావిస్తోంది. 
 
అయితే చైనా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ దేశం లక్ష్యం నెరవేరడం అంత సులభం కాదు. ప్రపంచవ్యాప్తంగా డాలర్ ఆమోదం పొందుతున్న తరుణంలో చైనా దెబ్బ కొట్టడానికి ప్రయత్నాలు చేసినంత మాత్రం డ్రాగన్ దేశం లక్ష్యం అంత సులభంగా నెరవేరదని తెలుస్తోంది. చైనా ఇలాంటి వ్యూహాలు చేస్తే అమెరికా మరింత కసిగా చైనాను దెబ్బ కొట్టే ప్రయత్నాలు చేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: