ఏపీ సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పకడ్బందీ చర్యలు ముందు నుండి చేపడుతూనే ఉన్నారు. చాలా వరకు జగన్ తీసుకున్న నిర్ణయాలను కేంద్రం కూడా అనుసరిస్తోంది. మండలాలను రెడ్, ఆరంజ్, గ్రీన్ జోన్స్ గా విభజించి జగన్ తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు దేశాని దిశానిర్దేశం చేస్తున్నాయి. ఇటువంటి సందర్భంలో రాబోయే రోజుల్లో ఇతర రాష్ట్రాల నుండి మరియు విదేశాల నుండి రాష్ట్రంలో కి వచ్చే వారి గురించి ముందు జాగ్రత్తలు తీసుకున్నారు జగన్. పూర్తి మేటర్ లోకి వెళితే ఇతర రాష్ట్రాల నుంచీ విదేశాల నుంచి వచ్చే వారిని క్వారంటైన్ లో పెట్టడానికి వీలుగా ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి జగన్ సన్నద్దం అవుతున్నారు. గ్రామ సచివాలయాలను ఇప్పుడు వాడుకోవటానికి రెడీ అవుతున్నారు.

 

ప్రతి గ్రామ సచివాలయాన్ని ఒక యూనిట్‌గా తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సచివాలయంలో కనీసం 10 నుంచి 15 మందికి క్వారంటైన్‌ వసతి కల్పించాలని పేర్కొన్నారు. భోజనం, సదుపాయాలు, బెడ్లు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. కరోనా పరిస్థితుల కారణంగా వివిధ రాష్ట్రాల్లో, విదేశాల్లో చిక్కుకుపోయిన వారు తిరిగి వస్తున్న నేపథ్యంలో అనుసరించాల్సిన విధానంపై సమావేశంలో చర్చ జరిగింది.కనీసం లక్ష పడకలు సిద్ధం చేసుకోవాలని సీఎం ఆదేశించారు.

 

అంగన్‌వాడీలు, మెప్మా, పంచాయతీరాజ్‌ శాఖ గ్రామాల్లో కరోనా క్వారంటైన్‌ చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. కనీసం 500 ఆర్టీసీ బస్సులను నిత్యావసరాలను తీసుకెళ్లే మొబైల్‌ వాహనాలుగా మార్చాలని సీఎం ఆదేశించారు. ఇదే సమయంలో కుదిరినంత వరకు ఫ్రీజర్లు ఏర్పాటుచేసి పాలు, పెరుగు, గుడ్లు, పండ్లు, లాంటి నిత్యావసరాలను ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. చాలావరకు కేంద్రంలో కూడా జగన్ తీసుకున్న నిర్ణయాలనే అనుసరిస్తున్నారు. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: