కరోనా మహమ్మారి వలన దాదాపు 50 రోజుల పైనుంచే లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే కరోనా తగ్గకపోవడంతో ప్రధాని మోదీ మరోసారి మే 17 వరకు లాక్ డౌన్ పొడిగించారు. కానీ గ్రీన్, ఆరెంజ్ జోన్లలో లాక్ డౌన్ సడలింపు ఇచ్చారు. ఇదే క్రమంలో ఏపీ ప్రభుత్వం ఆ రెండు జోన్లలో మద్యం అమ్మకాలకు సిద్ధమైంది. అలాగే  మద్యం ఉత్పత్తికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ప్రభుత్వ అనుమతితో ఆదివారం 20 డిస్టలరీలు తెరుచుకోనున్నాయి.

 

లాక్ డౌన్ వల్ల ఆర్ధిక పరిస్థితులు కుంటుపడిపోవడంతో, సీఎం జగన్ మద్య అమ్మకాలకు పర్మిషన్ ఇచ్చారు. అయితే జగన్ అధికారంలోకి వచ్చినప్పుడు దశల వారీగా మద్య నిషేధం చేయడంలో భాగంగా, ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడపడం మొదలుపెట్టింది. అలాగే కొన్ని షాపుల్ని తగ్గించింది.

 

అయితే అలా మద్య నిషేధం వైపు వెళుతున్న జగన్ ప్రభుత్వం, లాక్ డౌన్ లో ఎలాగో షాపులని క్లోజ్ చేసారు కాబట్టి, అదే విధానం కొనసాగిస్తే మద్య నిషేధం జరిగిపోతుంది కదా అని టీడీపీ నేతలు అంటున్నారు. అసలు ప్రజలు చచ్చిపోతుంటే ప్రభుత్వానికి ఆదాయం పేరుతో వైన్ షాప్‌లో ఓపెన్ చేస్తారా..? రెండు వారాల్లో ఓపిక పట్ట లేరా..? అంటూ టీడీపీ నాయకురాలు అనిత ఫైర్ అయిపోతున్నారు.నిజంగా చిత్తశుద్ధి ఉంటే దశలవారీగా ఎందుకు? ఇప్పుడు ఎలాగో అవకాశం వచ్చింది పూర్తిగా నిలిపివేయండని అంటున్నారు.

 

అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మద్యం వల్లే రాష్ట్రానికి ఎక్కువ ఆదాయం వస్తుందని, లాక్ డౌన్ వల్ల రాష్ట్రం చాలా నష్టపోయిందని, ఆర్ధిక పరంగా అనేక ఇబ్బందులు వస్తాయని, అలాంటాప్పుడు మద్యం దుకాణాలు ఓపెన్ చేయడమే కరెక్ట్ అని కొందరు రాజకీయ విశ్లేషుకులు చెబుతున్నారు. టీడీపీ నేతలు అన్నిటిని రాజకీయం చేస్తున్నారని, అందుకే మద్యం విషయాన్ని తెరపైకి తెచ్చి, జగన్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని అనుకుంటున్నారని చెబుతున్నారు. ఇలాంటి టైంలో జగన్ తీసుకున్న నిర్ణయం సరైనదే అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: