అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలోను చైనాపై విమర్శలు చేస్తున్నాడు. చైనానే కరోనా వైరస్ ను పుట్టించిందని... కరోనా విషయంలో చైనా అసలు నిజాలను దాస్తోందని గతంలో ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య కరోనా వల్ల మాటల యుద్ధం జరుగుతోంది. పలు దేశాలు అమెరికాకే మద్దతు ఇస్తూ చైనాకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయి. ఇరు దేశాల మధ్య యుద్ధం వచ్చే పరిస్థితులు లేకపోయినా మాటల యుద్ధం ఐతే జరుగుతోంది. 
 
ఇలంటి తరుణంలో ప్రపంచ దేశాలన్నీ కరోనా కట్టడి కోసం పోరాడుతుంటే చైనా మాత్రం దక్షిణ చైనా సముద్రంలో తన ఆధిపత్యం నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది. చైనా సముద్రంలో ఉన్న పారాసెల్, స్ప్రాటీ దీవులను రెండు జిల్లాలుగా అభివృద్ధి చేయాలని యోచిస్తోంది. వియత్నాం, ఫిలిప్పీన్స్, తైవాన్, మలేసియా, బ్రూనై దేశాలను దేశాలను దక్షిణ చైనా సముద్రంలోకి అడుగుపెట్టనివ్వకుండా చేయాలనే వ్యూహంతో చైనా ఈ నిర్ణయం తీసుకుంది. 
 
చైనా ఇక్కడ స్థావరాలను ఏర్పాటు చేసుకునే ప్రయత్నాలు చేయడం వల్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆయిల్ నిక్షేపాలను వెతుకుతున్న మలేషియాకు సంబంధించిన నౌకలు కూడా చైనా స్థావరాలకు యాడ్ కావడంతో అమెరికాకు సంబంధించిన యుద్ధనౌకలు ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. అమెరికాకు చెందిన ఇతర నౌకలు కూడా దక్షిణ చైనా సముద్రానికి చేరుకున్నయని అమెరికా నావీ ప్రకటించింది. 
 
తాజాగా ఆస్ట్రేలియాకు సంబంధించిన యుద్ధనౌకలు కూడా అక్కడికి చేరుకున్నాయి. అమెరికా, ఆస్ట్రేలియా రోటీన్ చర్యల్లో భాగంగా యుద్ధనౌకలను పంపించామని చెబుతున్నాయి. చైనా దీవులను ఆక్రమించుకోవాలని ఎత్తుగడ వేయగా ఆ ఎత్తుగడను తిప్పికొట్టే ప్రయత్నంలో భాగంగా అమెరికా మిత్ర దేశాలు ఆ ప్రాంతానికి యుద్ధ నౌకలు పంపించాయని సమాచారం. తాజాగా అమెరికా చైనాల మధ్య జల యుద్ధం జరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మరి రానున్న రోజుల్లో ఆ ప్రాంతంలో ఏం జరుగుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: