ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీవ్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వచ్చిన నాటి నుండి చంద్రబాబు రాష్ట్రంలో లేకుండా హైదరాబాదులో ఉండటంతో ఏపీ అధికార పార్టీ నేతలు ఎప్పటి నుండి విమర్శలు చేస్తున్న విషయం అందరికీ తెలిసినదే. మరోపక్క హైదరాబాద్ లో ఉంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం సరిగా పనిచేయడం లేదని కరోనా వైరస్ కట్టడి చేయడంలో వైయస్ జగన్ సర్కార్ ఫెయిల్ అయిందని బాబు ఆరోపణలు చేయడం తో ఏపీ రాజకీయాల్లో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అధికారం మరియు విపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు.

 

కరోనా వైరస్ అనే ప్రమాదకరమైన విషయం నుండి టాపిక్ డైవర్ట్ చేస్తూ వైసిపి - టిడిపి నేతలు చేసుకుంటున్న విమర్శల పట్ల ఏపీలో తీవ్రస్థాయిలో జనాలు మండిపడుతున్నారు. తాజాగా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మీడియా సమావేశం పేట్టడం మనకందరికీ తెలిసినదే. ఈ సందర్భంగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి... చంద్రబాబును ఉద్దేశించి సెటైర్లు వేయడం జరిగింది. చంద్రబాబు ప్రస్తుతం అధికారంలో ఉంటే మాపై విమర్శలు చేస్తున్న పత్రికలు ఈ విధంగా వ్యవహరించేవి అని మాట్లాడుతూ…. కరోనా పై కత్తి యుద్దం.. అర్థరాత్రి ఒంటి గంట వరకూ బాబు సమీక్ష.. ఐరాసలో కరోనా పై బాబు ప్రజెంటేషన్.. పారిశుద్ధ్య కార్మికులు.. అధికారులపై ఆగ్రహం.. కరోనాను బాబు జయించారన్న వార్తల్ని రాసే వారిని చెప్పుకొచ్చారు.

 

దీంతో ఉన్న కొద్దీ పార్టీ నేతలు ప్రతిపక్షం పై విమర్శలు ఎక్కువ చేస్తున్న తరుణంలో జగన్ …బుగ్గన చేసిన వ్యాఖ్యలపై సీరియస్ అయినట్లు పార్టీలో టాక్. ఇప్పటికే కరోనా వైరస్ పక్కనపెట్టి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారని జనాలు మండి పడుతూ ఉంటే… ఇలాంటి టైమ్ లో మరీ సెటైర్లు వేస్తూ విమర్శలు చేయటం వల్ల పార్టీకి నష్టం అవుతుందని జగన్ అన్నట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: