తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వచ్చిన నాటి నుండి ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు సీఎం కేసీఆర్. వైరస్ గురించి ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూ మరోపక్క ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపడుతోంది వంటి విషయాలను మీడియా సమావేశం ద్వారా  కేసీఆర్ చాలా చాకచక్యంగా మొన్నటిదాకా వ్యవహరించారు. తాజాగా మాత్రం  కేసీఆర్ నీ డామినేట్ చేస్తూ తెలంగాణ వైద్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ వ్యవహరిస్తున్నారు.

 

సమస్య ఎక్కడ ఉంటే అక్కడ వాలిపోతూ పరిష్కారం చేస్తూ ముందుకు దూసుకుపోతున్నారు. ఎక్కడా కూడా వైద్య సదుపాయాలు తక్కువ కాకుండా, సమస్య లేకుండా అన్ని జాగ్రత్తలు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. మొదటిలో కేసీఆర్ వ్యవహరించిన తీరు కంటే దానికి భిన్నంగా ఈటెల రాజేందర్ వ్యవహరిస్తున్నారు. చాలా యాక్టివ్ గా ఉంటూ అంతా తానై వ్యవహరిస్తున్నారు.

 

అయితే కెసిఆర్ ఎక్కువగా మీడియా ముందుకి రాకపోవడానికి గల కారణం, కేంద్రం లాక్ డౌన్ పొడిగింపు వల్లే మీడియా ముందుకు రావటం లేదని విపక్షాలు అంటున్నాయి. ప్రజల్లో అసహనం పెరిగే అవకాశం ఉండటంతో అది తనపై తన పార్టీపై పడకూడదని ఈ విధంగా మంత్రి ఈటల రాజేందర్ తో  మీడియా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రాజకీయాల్లో టాక్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యావరేజ్ గా పెరుగుతూనే ఉన్నాయి. అయితే రాష్ట్రంలో ఉన్న వైరస్ తీవ్రత బట్టి కేసీఆర్ ప్రధాన నగరాల్లో వైరస్ ప్రభావం లేకుండా గట్టి చర్యలు చేపట్టడానికి సన్నాహాలు చేస్తున్నట్లు టిఆర్ఎస్ పార్టీలో టాక్. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple.

మరింత సమాచారం తెలుసుకోండి: