కరోనా వైరస్ కట్టడి చేయడంలో సిఎం వైఎస్ జగన్ తీవ్రస్థాయిలో కృషి చేస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ పరీక్షలు జరుగుతున్నాయి. చాలావరకు కరోనా వైరస్ వ్యాధిగ్రస్తుని కనిపెట్టి వైరస్ విస్తరించకుండా ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేస్తున్నారు. మరోపక్క దేశానికి ఆదర్శంగా జగన్ తీసుకొన్ననిర్ణయాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకున్న పట్టణం విజయవాడ. ఈ నేపథ్యంలో విజయవాడలో కరోనా వైరస్ కట్టడి చేయడంలో వైసీపీ పార్టీలో ఆధిపత్య రాజకీయాలు జరుగుతున్నట్లు సమాచారం.

 

పూర్తి మేటర్ లోకి వెళ్తే దేవినేని అవినాష్ మరియు వైసిపి పార్టీ ఇన్చార్జి బొప్పన భ‌వకుమార్‌కు మ‌ధ్య కొన్నాళ్లుగా మ‌న‌స్పర్థలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ ముందు వరకు ఇద్దరు ఎవరికి వారు నియోజకవర్గాలలో జోరుగా పర్యటించారు. దాతలను సమీకరించి నిధులు అందించేలా వ్యవహరించారు. అయితే ఈ సమయంలో దేవినేని అవినాష్ తనదైన శైలిలో రాజకీయం చేస్తూ బెజవాడ లో ఉండే బడా బడా పారిశ్రామికవేత్తలను రంగంలోకి దింపి కరోనా వైరస్ బాధితులకు అలాగే పేద మరియు మధ్యతరగతి ప్రజలకు సహాయం అందేలా వ్యవహరిస్తూ, తనకు పోటీగా వస్తున్న బొప్పన భ‌వకుమార్‌కు తనదైన శైలిలో చెక్ పెట్టినట్లు బెజవాడ రాజకీయాల్లో టాక్.

 

ఈ క్రమంలో దేవినేని అవినాష్ తన నియోజకవర్గంలో సహాయం చేసిన వ్యాపార పారిశ్రామిక దాత‌ల‌ను వారి పనితనాన్ని దయగా స్పందించిన విధానాన్ని జగన్ కి తెలియజేయడం జరిగిందట. దీంతో దేవినేని అవినాష్ విజయవాడలో చేస్తున్న రాజకీయం ని చూసి జగన్ కూడా షాక్ అయినట్లు వైసీపీ పార్టీలో టాక్. తన తండ్రి మాదిరిగానే అవినాష్ ఒకే ఒక్కడు అయ్యి పార్టీని కేడర్ ని ఇటువంటి విపత్కర సమయంలో కూడా బానే కాపాడుకుంటున్నాడు అని అందరూ అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: