ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కృష్ణా జిల్లా కీలకం. మరీ ముఖ్యంగా ఈ జిల్లాలో గన్నవరం నియోజకవర్గం రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకున్న నియోజకవర్గం. అటువంటి ఈ నియోజకవర్గంలో వల్లభనేని వంశీ దాదాపు రెండు సార్లు గెలవడం జరిగింది. గత సార్వత్రిక ఎన్నికల టైంలో వైసిపి పార్టీ నాయకుడు యార్లగ‌డ్డ వెంక‌ట్రావ్ ...వంశీ మీద పోటీ చేసి ఓడిపో వడం జరిగింది. అయితే వైసీపీ పార్టీ అధికారంలోకి రావడంతో గన్నవరంలో రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. వల్లభనేని వంశీ టీడీపీ అధినేత చంద్రబాబు ని మరియు ఆయన కుమారుడు నారా లోకేష్ ని బహిరంగంగా మీడియా ముందు మరియు అసెంబ్లీలో తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం జరిగింది.

 

పార్టీకి రాజీనామా చేస్తూ ఎమ్మెల్యేగా కొనసాగుతూ వస్తున్న వల్లభనేని వంశీ చాలావరకూ కొద్ది నెలల క్రితం నుండి జగన్ పార్టీకి ఇండైరెక్టుగా సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. దాదాపు వంశీ వ్యవహార శైలి చూస్తే జగన్ పార్టీలో అధికారికంగా చేర‌క‌పోయినా.. సానుభూతిప‌రుడిగా మారిన నేప‌థ్యంలో వైసీపీ అధినేత జ‌గ‌న్ ముందు త‌న స‌త్తా నిరూపించుకునేందుకు వల్లభనేని వంశీ ప్రయ‌త్నించారు. ఈ క్రమంలోనే స్థానిక ఎన్నిక‌ల‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

 

అయితే కరోనా వైరస్ కారణంగా తర్వాత మరియు మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహరించిన తీరుతో ఆ ఎన్నికలు వాయిదా పడటం జరిగింది. అయితే జగన్ కూడా తన పార్టీలోకి వంశీని తీసుకోవాలని భావించిన ఐదు నెలల కాలంలో వంశీ వల్ల పార్టీకి ఒరిగినది ఏమీ లేదని చెప్పవచ్చు. పైగా గన్నవరం నియోజకవర్గంలో యార్లగ‌డ్డ వెంక‌ట్రావ్ ఇప్పటికే దుకాణం స‌ర్దేసుకున్నారు. అయితే తాజాగా వినబడుతున్న సమాచారం ప్రకారం వల్లభనేని వంశీ.. ప్రస్తుత రాష్ట్ర పరిణామాల కారణంగా తిరిగి టి.డి.పి లోనే ఉండాలని భావిస్తున్నట్లు టాక్. 

మరింత సమాచారం తెలుసుకోండి: