కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలని ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు.. కుల మతాలకు అతీతంగా పేదలకు  సాయం చేయడంలో ముండుకొస్తూ మరో సారి భారత దేశం సకల మత సమ్మేళనం అని నిరూపించింది ..  దేశ వ్యాప్తంగా మే17 వరకు లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే ఉంటూ కరోనా సోకకుండా జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు . 

 

 

 

 

ఇకపోతే కరోనా కారణంగా బాధపడుతున్న పేదలను ఆదుకోవడానికి స్వంచంధ సంస్థలు ముందుకొస్తున్నాయి.. దాంతో పాటుగా సినీ రాజకీయ ప్రముఖులు అభిమానుల కూడా ఎక్కడిక్కడ అన్నదాన కార్యక్రమాలు చేస్తూ పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు.  ఇప్పటికే తెలుగు చిత్ర పరిశ్రమలోని చాలా మంది పేదలకు అన్నదానం అందజేస్తూ వస్తున్నారు.. మరీ కొందరు సోషల్ మీడియాలో చురుకుగా పాల్గొంటూ జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు.  

 

 

 

 

కరోనా ను తరిమికొట్టడానికి మోదీ ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తోంది..కరోనా నియంత్రణలో భాగంగా లాక్ డౌన్ అమలులోకి తీసుకొచ్చారు.. అందులో భాగంగా ప్రజలు ఇళ్లకే పరిమితం అవ్వడంతో అన్నీ రంగాలు స్వచ్చందంగా మూతపడ్డాయి..ప్రజల్లో కరోనా పై అవగాహన కల్పించడానికి సినీ రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా ను వేదికగా తెలియ పరుస్తున్నారు.. తాజాగా ప్రముఖ నటుడు , డబ్బింగ్ ఆర్టిస్ట్ సాయి కుమార్ మరో  వీడియో ను పోస్ట్ చేశాడు. అందులో మోదీ తీసుకొచ్చిన ఏడు సూత్రాల గురించి వివరించారు.. అలాగే ఇళ్లలోనే ఉండండి..కరోనా ను తరిమికొడదామని విజ్ఞప్తి చేశారు.. 

 

 

 

ఆంధ్రప్రదేశ్ లో కరోనా ప్రభావం రోజు రోజుకు తీవ్ర రూపం మారుతుంది.  చిత్తూరు జిల్లాలో కరోనా ప్రభావం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. కడపలో లాక్ డౌన్ ఆంక్షలను పోలీసులు కఠినతరం చేశారు.. ప్రజలు ఇళ్ళ నుంచి బయటకు రావద్దని పోలీస్ జీపులతోను, ఆటోలతో వెళ్లి అనౌన్స్ మెంట్ చేస్తూ కరోనా పై అవగాహన కల్పించారు. డ్రోన్ కెమెరాల ద్వారా నగరంలోని లాక్ డౌన్ పరిస్థితిని గమనించారు..లాక్ డౌన్ ముగిసేవరకు ప్రజలు ప్రభుత్వం నిబంధనలను పాటిస్తూ , ఇళ్లలోనే ఉండాలని సూచించారు

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: