కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలని ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు.. కుల మతాలకు అతీతంగా పేదలకు  సాయం చేయడంలో ముండుకొస్తూ మరో సారి భారత దేశం సకల మత సమ్మేళనం అని నిరూపించింది ..  దేశ వ్యాప్తంగా మే 17 వరకు లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే ఉంటూ కరోనా సోకకుండా జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు . సామాజిక దూరాన్ని పాటించాలని పదే   పదె చెబుతున్నారు..

 

 

 

 

 

కరోనా పై ఉదయం లేచినప్పటి నుంచి పడుకొనే వరకు కూడా పోలీసులు , డాక్టర్లు, కార్మికులు కష్టపడుతున్నారు.. ఈ మేరకు లాక్ డౌన్ రూల్స్ బ్రేక్ చేయకుండా ప్రజలను , అటు తమరిని తామే రక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారు.. అందుకే పోలీసుల సేవలను మెచ్చి చాలా. ప్రాంతాల్లో ప్రజలు వారి పాదాలకు పాలాభిషేకం చేస్తున్నారు.. మరి కొందరేమో పోలీసుల ఆకలిని తీర్చడానికి ముందుకొస్తున్నారు. అలా పోలీసులు సేవలు నిజంగానే గ్రేట్ అని చెప్పాలి..

 

 

 

 

 

 

 

కరోనా నియంత్రణలో పోలీసులు ప్రముఖ పాత్రను పోషిస్తూ ప్రజలను కాపాడుతున్నారు..దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలకు కరోనా వ్యాప్తి పై అవగాహన కల్పిస్తున్నారు.. ఈ మేరకు నెల్లూరు జిల్లాలో పోలీసులు లాక్ డౌన్ చర్యలను మరింత ముమ్మరం చేశారు.నగరంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో , ప్రజలను ఇళ్లకే పరిమతమయ్యేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.. 

 

 

 

 

 

 

 

ఈ నేపథ్యంలో  రోడ్ల పైకి వస్తున్న వాహనాలలో తనిఖీలు నిర్వహించి , వాహనాల నెంబర్లను నమోదు చేసుకొని పంపుతున్నారు.. టూ వీలర్ లో ఒకరు, ఫోర్ వీలర్ లో అయితే  ఇద్దరు మాత్రమే ప్రయానించాలని సూచించారు.. అత్యవసర పరిస్థితిలో మాత్రం బయటకు రావాలని పిలపునిచ్చారు.. అలా కాకుండా లాక్ డౌన్ రూల్స్ ను ఉల్లంఘిస్తే క్రిమినల్ చర్యలు తప్పవని హెచ్చరించారు..దయచేసి లాక్ డౌన్ పాటించండి మీ ప్రాణాలను కాపాడుకోండి..మే 17 వరకు కొనసాగుతున్న లాక్ డౌన్ లో ప్రజలు భాగస్వాములై కరోనా ను నియంత్రించాలని పోలీసులు చేతులెత్తి  మొక్కుకున్నారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: