ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాక్ డౌన్  కొనసాగుతున్న నేపథ్యంలో టమాటా రైతులు సహా పలువురు రైతులు పంటను ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదు అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు పెడుతున్న విషయం తెలిసిందే. మరోవైపు ప్రభుత్వం అన్ని రకాల కూరగాయలను తాము కొనుగోలు చేస్తున్నామని అంటూ చెబుతోంది. ఈ క్రమంలోనే కొంత మంది రైతులు టమాటాలకు  సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. దీనికి సంబంధించి నటువంటి వివరాలను ఆంధ్ర ప్రదేశ్ ప్రస్తుత వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి పలు వివరాలను తెలియజేస్తున్నారు. 

 


 వ్యవసాయ మార్కెట్ కమిటీ లెక్కల ప్రకారం మదనపల్లిలో టమోటా ధర 10 కేజీలకు  కనిష్టం గరిష్టం చూసుకుంటే... కనిష్టం  యాభై ఎనిమిది రూపాయలు గరిష్టం 76 రూపాయలు... మోడల్ 68 రూపాయల గా ఉంది అంటూ తెలిపారు. అదే సందర్భంలో 30-4 2019 న మొత్తం సరుకు 700 మెట్రిక్ టన్నులు కాగా... 30-4-2019 న  టమాటాలు పది కేజీల కి కనిష్టం గరిష్టం చూసుకున్నప్పుడు కనిష్టం 28 ఒకటో  రకం... గరిష్టం 40 రూపాయలు మోడల్ 38 రూపాయలు.... రెండోరకం 11, 27 28 గా ఉన్నట్లు తెలిపారు. 

 


 కరోనా  వైరస్ విజృంభిస్తున్న వేళ  ప్రస్తుతం రైతులందరూ ఎలాంటి డిమాండ్ లేక  కష్టాల్లో ఉన్న తరుణంలో... ప్రభుత్వం రైతులు పండించిన పంటను కొనుగోలు చేశారా లేదా మరి రైతులు పెడుతున్న వీడియోలు వెనుక అసలు కారణం ఏమిటి. కేవలం మార్కెట్కు వచ్చిన సరుకులు మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేసింద లేక రైతుల పొలాల వద్ద కు వెళ్ళి కొనుగోలు చేసిందా.  అయితే ఇప్పుడు వరకు ప్రభుత్వం ఎంత కొనుగోలు చేసింది ఇంకా ఎంత కొనుగోలు చేయాల్సి ఉంది... అన్నది తేలాల్సి ఉంది. అయితే ప్రస్తుతం లాక్ డౌన్ సడలింపులు  మరింతమంది కొనుగోలు చేయడానికి దళారులు  ముందుకు వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: