దేశవ్యాప్తంగా విధించిన రెండో దశ లాక్ డౌన్ ఈరోజు తో ముగియనుంది అయితే  ఈ లాక్ డౌన్ లో నైనా కరోనా ప్రభావం తగ్గుతుందోమో అనుకుంటే మరింత పెరిగింది. గత కొద్దీ రోజుల నుండి భారీ సంఖ్యలో కేసులు నమోదవుతుండగా నిన్న ఒక్క రోజే దేశ వ్యాప్తంగా 2500 కేసులు నమోదయ్యాయి. రోజుల వారిగా చూసుకుంటే ఇప్పటివరకు ఇదే హైయెస్ట్.
 
ఇక కరోనా ప్రభావం ఎక్కువగా వున్న దాదాపు ప్రతి రాష్ట్రాల్లో నిన్న అత్యధిక కేసులు నమోదయ్యాయి. అందులో భాగంగా మహారాష్ట్ర లో 790 కేసులు ,గుజరాత్ లో 333 కేసులు ,తమిళనాడులో 231,పంజాబ్ 187 కేసులు నమోదయ్యాయి. దాంతో దేశంలో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 39800 కు చేరగా 1200కు పైగా మరణాలు సంభవించాయి. మరో వైపు  కరోనా ప్రభావం వల్ల రేపటి నుండి మూడో దశ లాక్ డౌన్ ప్రారంభంకానుంది. మే17వరకు ఈలాక్ డౌన్ కొనసాగుంది. అయితే ఆలోగా నైనా కరోనా కట్టడి అవుతుందా అనేది అనుమానంగానే మారింది. 
 
ఇక మూడో దశలో ఒక్క రెడ్ జోన్ లో మినహా గ్రీన్ , ఆరెంజ్ జోన్లలో కేంద్రం చాలా సడలింపులు ప్రకటించింది. అయితే ఈ జోన్ల  విషయంలో కొన్ని రాష్ట్రాలు సంతృప్తి ని వ్యక్తం చెయ్యట్లేదు.  కరోనా ప్రభావం ఆధారంగా జోన్ల  ను ఏర్పాటు చేసింది కేంద్రం. అయితే  అసలు కేసులు లేని జిల్లాలను కూడా ఆరెంజ్ జోన్ లోకి మార్చడం  ఆయా రాష్ట్రాలకు నచ్చలేదని తెలుస్తుంది. అందులో తెలంగాణ కూడావుంది. తెలంగాణలో ప్రస్తుతం హైదరాబాద్ లో తప్ప వేరే ఏ జిల్లాల్లో కరోనా కేసులు లేవు అయినా కూడా చాలా జిల్లాలను ఆరెంజ్జోన్ లో వేసింది దాంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కొన్ని జిల్లాలను గ్రీన్ జోన్ లో వేయడానికి మొగ్గుచూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: